రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలి కుమారుడు షారూఖ్ (21) అంత్యక్రియలు గుంటూరు జిల్లా అండపేటలోని ఖభరిస్తాన్లో పూర్తయ్యాయి. ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా, తెదేపా నేత నసీర్ అహమ్మద్, మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. చివరి చూపు చూసేందుకు బంధువులు, వివిధ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, స్నేహితులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కుటుంబసభ్యుల ఆవేదన ప్రతి ఒక్కరినీ కంట తడి పెట్టించింది.

ఇదీ చదవండి: తెనాలిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కాంగ్రెస్ శ్రేణుల నిరసన