ETV Bharat / state

వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ 'స్పీక్ అప్ ఫర్ ఫార్మర్స్'

వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా రేపు 'స్పీక్ అప్ ఫర్ ఫార్మర్స్' కార్యక్రమం చేపట్టనున్నట్లు ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి అన్నారు. ఈ నెల 28న ఐదు వందల మందితో కలిసి గవర్నర్​కు వినతి పత్రం అందజేయనున్నట్ల వెల్లడించారు.

congress leader mastan vali on agriculture bill
మస్తాన్ వలి
author img

By

Published : Sep 25, 2020, 2:18 PM IST

వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి అన్నారు. ఈ బిల్లు వల్ల కార్పొరేట్ శక్తులకు లాభమని మస్తాన్ వలి ఆరోపించారు. భాజపా ప్రభుత్వ నియంతృత్వ పోకడలను వ్యతిరేకిస్తూ 26వ తేదీన 'స్పీక్ అప్ ఫర్ ఫార్మర్స్' అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. 28న ఐదు వందల మందితో కలిసి గవర్నర్​కు వినతి పత్రం అందజేస్తామని మస్తాన్ వలి తెలిపారు.

అక్టోబర్ 2న విశాఖపట్నంలో కిసాన్ మజ్దూర్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ బిల్లుకి వ్యతిరేకంగా అక్టోబర్ 2 నుంచి 31 తేదీ వరకు సంతకాల సేకరణ చేపడతామని తెలిపారు.

ఇదీ చదవండి: 'బిల్లు'పై దేశవ్యాప్తంగా ఆందోళనలు- పోలీసులు అప్రమత్తం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.