గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురులోని పోలింగ్ కేంద్రం వద్ద కొందరు హడావుడి చేశారు. గుంపులుగా వచ్చి పోలింగ్ బూత్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న అధికారులు, పోలీసులపైన పెద్దగా కేకలు వేస్తూ గందరగోళం చేశారు. పోలీసులు వారిని లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దీంతో అధికార పార్టీ నేతలనే అడ్డుకుంటారా అంటూ వాగ్వాదానికి దిగారని ఎస్సై తెలిపారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట జరిగిందని చెప్పారు. తమను విధులు నిర్వర్తించకుండా వైకాపా నేతలు అడ్డుకుంటున్నారని పోలీసులు ఆరోపించారు.
ఇదీ చదవండి: గుంటూరు జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభం