రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా తెదేపా, టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తెనాలిలో నిరసన చేపట్టారు. ప్రజలపై పెరిగిన పన్నుల భారాన్ని వెంటనే తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. గాంధీ చౌక్ నుంచి మార్కెట్ సెంటర్ వరకు బైకును తాడుతో కట్టి లాగుతూ.. ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఈ పెట్రోల్ ధరలతో బైకు నడపలేమంటూ కాల్వలో పడేసి నిరసన వ్యక్తం చేశారు.
ప్రతిపక్షం హోదాలో ధరలు తగ్గిస్తామని ఊరువాడా తిరిగి ప్రకటనలు చేసిన సీఎం జగన్.. ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ధరలు పెంచుకుంటూ పోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ప్రజలపై పన్నుల భారం తగ్గించాలని కోరారు.
నిత్యావసర వస్తు ధరలు అదుపు చేయాలి
నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయాలని డిమాండ్ చేస్తూ.. విశాఖలో వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్న ప్రజలపై మోయలేని భారాలు వేయడం సమంజసం కాదన్నారు. సీపీఎం, సీపీఐ, న్యూ డెమోక్రసీ కార్యకర్తలు.. జీవీఎంసీ గాంధీ పార్కులో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ధరలు అదుపు చేయకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
ఇదీ చదవండి..
RDS Controversy: ఆర్‌డీఎస్ కుడికాలువ నిర్మాణం సక్రమమే: మంత్రి అనిల్