ETV Bharat / state

విజయవాడలో పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్య - Vijayawada latest news

నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికే వేళ..ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఉన్నత చదువు చదువుతున్న ఒక్కగానొక్క కుమార్తె శాశ్వతంగా వారిని వీడిపోయింది. విజయవాడ నగరం భవానీపురం మీరా సాహెబ్‌వీధిలో శుక్రవారం ఈ సంఘటన వెలుగుచూసింది. భవానీపురం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి...

విజయవాడలో పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్య

author img

By

Published : Jan 2, 2021, 12:16 AM IST

Updated : Jan 2, 2021, 8:25 AM IST

మంగు నాగబాబు, జయలక్ష్మి దంపతులు భవానీపురంలో నివాసం ఉంటున్నారు. వారి ఏకైక సంతానం దేవి ప్రియాంక (25). తండ్రి కొండపల్లిలోని జి.ఎం.కె.ల్యాబ్స్‌ కంపెనీలో పని చేస్తున్నారు. దేవి ప్రియాంక గుంటూరులోని కాటూరి మెడికల్‌ కళాశాలలో ఎండీ (పల్మనాలజీ) ద్వితీయ సంవత్సరం చదువుతోంది. రోజూ మాదిరిగానే గురువారం కళాశాలకు వెళ్లి ఇంటికి వచ్చింది. రాత్రి 7:30 గంటలకు తల్లిదండ్రులు విద్యాధరపురంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. కుమార్తెను రావాలని కోరగా చదువుకోవాలని చెప్పడంతో ఆమెను ఇంటి వద్దనే ఉంచి వారు వెళ్లారు. తిరిగి రాత్రి 9:30 గంటలకు ఇంటికి వచ్చి చూడగా కుమార్తె ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. ప్రాణం ఉన్నదేమోనన్న ఆశతో కూతురును కిందకు దింపి 108కు సమాచారం ఇచ్చారు. వారి వచ్చి పరీక్షించి చనిపోయినట్లుగా ధ్రువీకరించారు. ఆపై ఆమె ల్యాప్‌టాప్‌ పక్కన ఉన్న డైరీని తల్లిదండ్రులు పరిశీలించారు. అందులో.. సారీ డాడీ..ఐలవ్‌యూ డాడీ, నాకు నీవంటే చాలా ఇష్టం డాడీ.., అమ్మా నీవంటే చాలా ఇష్టం.., బాయ్‌ అమ్మా.. బాయ్‌ నాన్నా.., నవీన్‌ వల్లే నేను చనిపోతున్నా.. అని రాసి ఉంది. ఆపై వారు భవానీపురం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారొచ్చి మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు.

తల్లిదండ్రులను ఒప్పించలేకనేనా..?: దేవి ప్రియాంక చిన్నప్పటి నుంచి చదువులో ప్రతిభను కనబరుస్తుంది. ఆమె పట్ల అమ్మానాన్నలు ఎంతో ప్రేమను కనబరిచేవారు. ఈ మధ్య వారు ఆమెకు వివాహం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. నాలుగైదు సంబంధాలు తీసుకువచ్చినా ఆమె ఒప్పుకోలేదు. అలాగే ఆమె మనసులోని మాటను తల్లిదండ్రుల వద్ద వ్యక్త పరచలేదు. ఒకవేళ చెప్పినా తల్లిదండ్రులను ఒప్పించలేననే భావనతోనే చనిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. వారు ఆమె కాల్‌ డేటాను పరిశీలిస్తున్నారు. చరవాణి, ల్యాప్‌టాప్‌ను సీజ్‌ చేశారు. నవీన్‌ ఎవరో తెలిస్తే యువతి మరణానికి కారణం తెలిసే అవకాశం ఉందని కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్‌ఐ రవీంద్ర తెలిపారు. అతడిని విచారిస్తామని పేర్కొన్నారు. భవానీపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి

సుపారి ఇచ్చి కన్నకొడుకును చంపించిన తల్లి

Last Updated : Jan 2, 2021, 8:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.