గుంటూరులో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలికా సదనం, శిశు గృహం, కళాశాల విద్యార్థినుల వసతి గృహాలను కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్, సుజాత దంపతులు సందర్శించారు. బాలికలు, విద్యార్థినులతో మాట్లాడి యోగక్షేమాలను తెలుసుకున్నారు. ఆన్ లైన్ క్లాసులకు తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ సూచించారు.
శిశు గృహంలోని చిన్నారులకు నిర్దేశించిన సమయంలో వ్యాక్సినేషన్, టీకాలు వేయించాలని పర్యవేక్షణ అధికారులకు నిర్ధేషించారు. ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం పౌష్టిక ఆహారాన్ని నాణ్యతలో రాజీపడకుండా అందించాలని ఆదేశించారు. అనంతరం.. కలెక్టర్ దంపతులు పిల్లలకు మిఠాయిలు అందజేశారు.
ఇదీ చదవండి: