ETV Bharat / state

'నాకే ఎదురు చెబుతారా..? అరెస్టు చేయండి'.. వైద్యాధికారిపై కలెక్టర్​ ఆగ్రహం - collector samuel anand fires on health officer news

ఓ వైద్యాధికారిపై గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకే ఎదురు చెప్తావా..? అంటూ ఆ అధికారిపై మండిపడ్డారు. వెంటనే అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

collector-samuel-anand-fires-on-health-officers-in-narasaraopeta

author img

By

Published : Sep 10, 2020, 7:25 PM IST

Updated : Sep 10, 2020, 10:33 PM IST

గుంటూరు జిల్లా నరసరావుపేటలోని టౌన్ హాల్​లో కరోనాపై వైద్యాధికారులతో గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పనితీరు పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనితో కలెక్టర్ తీరు పట్ల నాదెండ్ల వైద్యాధికారి సోమ్లా నాయక్ అభ్యంతరం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో కష్టపడే తమతో.. ఇలా మాట్లాడటం సరికాదని వైద్యుడు ఆవేదన వ్యక్తం చేశాడు. సమావేశంలో వైద్యాధికారి ఎదురు చెప్పడంపై కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకే ఎదురు చెబుతావా అంటూ వైద్యుడిపై కలెక్టర్ మండిపడ్డారు. వెంటనే వైద్యుడిని అరెస్టు చేయాలంటూ డీఎస్పీతో చెప్పారు. సస్పెండ్ చేయాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. కలెక్టర్ తీరుపై వైద్య వర్గాలు ఖంగుతిన్నాయి.

'నాకే ఎదురు చెబుతారా?... అరెస్టు చేయండి'... వైద్యాధికారిపై కలెక్టర్​ ఆగ్రహం

జులుం ప్రదర్శించడం ఘోరం: లోకేశ్

కలెక్టర్ తీరును తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తప్పుపట్టారు. వైద్యాధికారిని చులకన చేసి మాట్లాడి.. అరెస్టు చేయడమేంటని నిలదీశారు. సమస్యలు లేవనెత్తితే గిరిజన అధికారిపై జులుం ప్రదర్శించడం ఘోరమని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి: మరోసారి 10 వేలకు పైనే కేసులు... 5,37,687కి చేరిన బాధితులు

Last Updated : Sep 10, 2020, 10:33 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.