అత్యాచార బాధితురాలిని పరామర్శించిన కలెక్టర్, ఎస్పీ - latest news on victim girl in ggh
అత్యాచారానికి గురై గుంటూరు సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను కలెక్టర్ శామ్యూల్ అనంద్ కుమార్, అర్బన్ ఎస్పీ రామకృష్ణ పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద బాలిక కుటుంబానికి అందాల్సిన సాయంపై సమీక్షించారు. కేసు పురోగతిపై ఆరా తీశారు. ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాలికకు కలెక్టర్, ఎస్పీ పరామర్శ