పఠాన్ అనే మూడేళ్ల బాలుడికి పుట్టుక నుంచి వినికిడి సమస్య. ఆరోగ్యశ్రీ పథకం కింద గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేశారు. ఈఎన్టీ వైద్యుడు డాక్టర్ బయ్యా శ్రీనివాసరావు, బయ్యా సుధీర్, ఆడియాలజిస్టు కిరణ్ కుమార్ సర్జరీ చేశారు. కుడి చెవికి గతేడాది జూన్ 19న ఆపరేషన్ చేయగా.. ఎడమ చెవికి మంగళవారం శస్త్రచికిత్స చేసినట్లు వైద్యులు వెల్లడించారు.
గతంలో ఒక చెవికే..
పుట్టుకతో బధిరులుగా ఉన్న పిల్లలకు గతంలో ఒక చెవికి మాత్రమే ఉచితంగా సర్జరీ చేసేవారు. తాజాగా ప్రభుత్వం రెండు చెవులకు కాక్లియర్ ఇంప్లాంట్‌కు అనుమతించడం కారణంగా పఠాన్‌కు ఆపరేషన్ చేశారు.
ఇవీ చూడండి...