కరోనా నివారణ చర్యలకు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ ప్రజల తరపున సీఎంఆర్ఎఫ్కు 1 కోటి 82 లక్షల 4 వేల 312 రూపాయల విరాళం అందింది.
తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిసి భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్.. ఈ సహాయానికి సంబంధించిన చెక్కును అందించారు. మంత్రులు ఆళ్ల నాని, పేర్ని వెంకట్రామయ్య పాల్గొన్నారు.