16నుంచి ప్రచారం పర్వం మొదలు
మూడు దశల్లో ఎన్నికల ప్రచారం చేపడుతున్నానని తెలిపారు. 16వ తేదీన తిరుపతి నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నాననీ.. అదే రోజు శ్రీకాకుళంలో పర్యటన ఉంటుందని వివరించారు. 17న విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటిస్తానని వెల్లడించారు. రెండో దశలో కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరుల్లో పర్యటన ఉంటుందని తెలిపారు. తర్వాతి దశలో కర్నూలు, కడప, అనంతపురంలో పర్యటిస్తానని తెలిపారు. 18 నుంచి లబ్ధిదారులే ముందుకువచ్చి తోచిన విధంగా పార్టీకి ప్రచారం చేస్తారని విశ్వాసం వ్యక్తంచేశారు.
వైకాపా కుట్రను నిలదీయండి
ఫారం-7 దుర్వినియోగంలో అడ్డంగా దొరికిపోయి.. ఇప్పుడు తన ఓటే తొలగించే ప్రయత్నం అంటూ జగన్ నాటకం ఆడుతున్నారని ముఖ్యమంత్రి విమర్శించారు. తెలంగాణ నుంచి అక్రమ మార్గంలో వచ్చే ధన ప్రవాహాన్ని అడ్డుకోవాలని పార్టీ నాయకులకు సూచించారు. మోదీ, కేసీఆర్, జగన్ అనుబంధం మరోసారి బట్టబయలైందనీ.. ఈడీ మాజీ డెరెక్టర్ సీబీఐకి రాసిన లేఖే ఇందుకు నిదర్శనమన్నారు. ఈడీ లేఖపై వైకాపాను నిలదీయాలనీ.. వీరి కుట్రను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర హక్కును తాకట్టు పెట్టే కుట్రను సహించవద్దనీ... ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే చర్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని తెలిపారు.
ఇవీ చదవండి..