BRS Public Meeting In Nanded at Maharashtra: మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రంలో శ్రీ గురు గోబింద్ సింగ్ ఎయిర్ పోర్ట్‌కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేరుకున్నాక.. సీఎం కేసీఆర్‌కు నాందేడ్, తెలంగాణ నాయకులు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా గురుద్వారాకు బయలుదేరి వెళ్లి అక్కడ ప్రార్థనలు చేసి.. సభాప్రాంగణమైన నాందేడ్‌లోని సచ్‌ఖండ్‌బోడ్ మైదానంలోని బీఆర్ఎస్ బహిరంగసభకు కేసీఆర్ బయలుదేరారు. అక్కడ ఆయనకు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.
తెలంగాణ ముఖ్యమంత్రి వెంట ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కూడా విచ్చేశారు. సభావేదిక పైకి చేరుకున్న కేసీఆర్.. శివాజీ, అంబేడ్కర్, పూలే విగ్రహాలకు నివాళులు అర్పించారు. అనంతరం ఆయన సమక్షంలో పలువురు మరాఠా నేతలు పార్టీలో చేరారు. వీరికి పార్టీ గులాబి కండువాలు కప్పి.. కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. మహిళా సర్పంచులకు ఎమ్మెల్సీ కవిత కండువాలను కప్పారు. తెలంగాణ వెలుపల బీఆర్ఎస్ సభ జరగడం నాందేడ్‌లోనే ప్రథమం కావడం విశేషం. అయితే సభ అవ్వాల్సిన సమయం కంటే గంటసేపు ఆలస్యంగా ప్రారంభమైంది. సభ పూరైన తర్వాత సాయంత్రం మీడియా సమావేశంలో కేసీఆర్ పాల్గొంటారు. అనంతరం సీఎం కేసీఆర్ తిరిగి హైదరాబాద్ రానున్నారని పార్టీ నేతలు వెల్లడించారు.
ఇవీ చదవండి: