ETV Bharat / state

వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించండి: సీఎం జగన్ - ఏపీలో కరోనా పరీక్షలు

రాష్ట్రంలో కరోనా నిర్ధరణ పరీక్షలు వేగవంతం చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. మూడో విడత కుటుంబ సర్వేలో గుర్తించిన అనుమానితులందరికీ పరీక్షలు చేయాలని స్పష్టం చేశారు.

cm jagan
cm jagan
author img

By

Published : Apr 17, 2020, 3:29 PM IST

దక్షిణ కొరియాలోని సియోల్‌ నుంచి ప్రత్యేక చార్టర్‌ విమానం ద్వారా రాష్ట్రానికి లక్ష కరోనా టెస్టింగ్ కిట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో కరోనా నిర్ధరణ పరీక్షలు వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే నిర్వహించిన మూడో విడత కుటుంబ సర్వేలో 32 వేల మంది కరోనా అనుమానితులను అధికారులు గుర్తించారు. వీరందరికీ కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.

కరోనా నివారణ చర్యలపై అమరావతిలో జగన్ సమీక్ష నిర్వహించారు. ర్యాపిడ్‌ టెస్టు కిట్లు రావటంతో కరోనా పరీక్షలు పెరుగుతున్నాయని వైద్యులు సీఎంకు వెల్లడించారు. రోజుకు 10 వేల నుంచి 15 వేలకు పరీక్షలు పెరుగుతాయని వివరించారు. కరోనా లక్షణాలు కనిపిస్తే ప్రధాన ఆస్పత్రికి తరలిస్తున్నామని అధికారులు సీఎంతో అన్నారు. క్రిటికల్‌ కేర్‌ మేనేజ్‌మెంట్‌కు వైద్యులతో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఆరోగ్యశ్రీలో నమోదైన రోగులకు ఫోన్‌ చేసి ఏ ఆస్పత్రిలో సేవలు లభిస్తాయో తెలియజేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. అలాగే క్వారంటైన్లలో సదుపాయాలు మెరుగుపరుస్తున్నామని అన్నారు. క్వారంటైన్‌ కేంద్రాల్లో ఒక గదికి ఒక్కరినే ఉంచినట్లు సీఎం జగన్​కు తెలిపారు.

ఇదీ చదవండి: రాష్ట్రానికి వచ్చిన లక్ష కరోనా ర్యాపిడ్‌ టెస్టు కిట్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.