ETV Bharat / state

Jagan Review on NITI Aayog: 27న దిల్లీలో నీతి ఆయోగ్​ సమావేశం.. పలు అంశాలపై సీఎం సమీక్ష - నీతి ఆయోగ్‌పై జగన్​ సమీక్ష

CM Jagan Review on NITI Aayog: ఈనెల 27న దిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్‌ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలను ప్రస్తావించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. వివిధ అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిని వివరించడంతోపాటు, కేంద్రం నుంచి సహాయాన్ని కోరాలని నిర్ణయించారు. ఈ మేరకు అవసరమైన నివేదికలు తయారు చేయాలని ఆదేశించారు. నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై అధికారులతో సమీక్షించిన సీఎం.. ఈ మేరకు కీలక ఆదేశాలు ఇచ్చారు.

Jagan Review on NITI Aayog
Jagan Review on NITI Aayog
author img

By

Published : May 23, 2023, 8:19 PM IST

CM Jagan Review on NITI Aayog: ఈనెల 27న దిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. ఆరోజు సమావేశానికి హాజరుకానున్న సీఎం జగన్.. నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశంలో చర్చించనున్న అంశాలపై అధికారులతో సమీక్షించారు. నీతి ఆయోగ్‌ సమావేశంలో వివిధ అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిని వివరించాలని నిర్ణయించారు. కేంద్రం నుంచి సహాయాన్ని కోరాలని నిర్ణయించారు. కీలక రంగాలకు సంబంధించి కొన్ని సూచనలను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎంఎస్‌ఎంఈలకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహాయాన్ని, మద్దతును నీతి ఆయోగ్‌ సమావేశంలో వివరించాలని నిర్ణయించారు. సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై అధికారులకు ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఫ్యామిలీ డాక్టర్‌ విధానంలో హైపర్‌ టెన్షన్, డయాబెటిస్, రెండూ ఉన్న వారిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. వీరికి వైద్యం అందించడం, ఫాలో అప్‌ చేయడం చాలా ముఖ్యమని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న, కొత్తగా నిర్మించే బోధనాసుపత్రుల్లో తప్పనిసరిగా క్యాన్సర్‌కు సంబంధించిన ల్యాబ్‌లు, కాథ్‌ ల్యాబ్స్‌ తప్పనిసరిగా పెట్టాలని, ఈ మేరకు కార్యాచరణ రూపొందించుకుని ముందుకు సాగాలన్నారు. వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య డేటా సమ్మిళితం చేసే అంశంపై సమావేశంలో చర్చించారు.

మహిళా శిశు సంక్షేమశాఖ, వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ ఈ మూడు విభాగాలు కలిసి డేటాను సమ్మిళితం చేయాలని సీఎం ఆదేశించారు. తల్లి గర్భం దాల్చి, కాన్పు పూర్తి అయిన తర్వాత శిశువుకు ఆధార్‌ నెంబరు కేటాయింపు జరిగేలా చూడాలన్నారు. ఆ తర్వాత పిల్లలకు పౌష్టికాహారం అందించడం దగ్గర నుంచి, అంగన్వాడీల్లో చేరిక, తర్వాత స్కూల్లో చేరిక వరకూ వారిని ట్రాక్‌ చేయడానికి సులభతరం అవుతుందన్నారు. పిల్లల ఆరోగ్యం, వ్యాక్సినేషన్, చదువులు తదితర అంశాలన్నింటినీ ట్రాక్‌ చేయడం కూడా సులభతరం అవుతుందన్నారు.

దిశ యాప్​ కింద చేపట్టిన కార్యక్రమాలనూ నీతి ఆయోగ్ సమావేశంలో వివరించాలని సమావేశంలో నిర్ణయించారు. దాదాపు 30వేలకు పైగా ఇంటర్‌వెన్షన్స్‌ జరిగిన విషయాన్ని హైలెట్‌ చేయాలని సూచించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ రంగంలో కార్యక్రమాల వేగాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. నియోజకవర్గానికి ఒక హబ్‌ను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఒక స్కిల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. అది వరకే డిగ్రీలు సాధించిన వారు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు ఈ స్కిల్‌ సెంటర్లు ఉపయోగపడతాయన్నారు.

నియోజకవర్గాలలో హబ్స్, జిల్లాల వారీగా సెంటర్లలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సుల రూపకల్పనకు ఒక యూనివర్శిటీని ఏర్పాటు చేయాలన్నారు. కాలానుగుణంగా వస్తున్న మార్పులను అందిపుచ్చుకునేందుకు ఈ కోర్సులను సంబంధిత యూనివర్శిటీ ద్వారా తయారు చేయించాలన్నారు. ఎంఎస్‌ఎంఈలకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహాయాన్ని, మద్దతును నీతి ఆయోగ్‌ సమావేశంలో వివరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్మయించింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్టిమెంట్‌ రంగంలో సాధించిన ప్రగతిని అధికారులు సమావేశంలో వివరించనున్నారు.

రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల్లో కొనసాగుతున్న పనులను వివరించాలని నిర్ణయించారు. 10 ఫిషింగ్‌ హార్బర్లు, 6 ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లతోనూ తీర ప్రాంతంలో గణనీయంగా పెరగనున్న మౌలిక సదుపాయాలు అంశాన్ని వివరించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కడప, కర్నూలు ఎయిర్‌పోర్టులకు నిధులు పూర్తిస్థాయిలో వెచ్చించి వాటిని సంపూర్ణ వినియోగంలోకి తీసుకొచ్చిన అంశాన్ని వివరించనున్నారు. కొత్తగా నిర్మిస్తున్న భోగాపురం ఎయిర్‌పోర్టు అంశాన్నీ ప్రస్తావించనున్నారు.

నెల్లూరు సమీపంలోని తెట్టువద్ద ఎయిర్‌పోర్టు నిర్మాణం ముందుకు సాగాలని సీఎం ఆదేశించారు. పరిశ్రమల నుంచి క్రమం తప్పకుండా ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలన్న సీఎం.. వారితో నిరంతరం మాట్లాడుతూ ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవడంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. బ్రాడ్‌ బ్యాండ్‌ నెట్‌వర్క్‌ను రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేయాలని ఆదేశించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.