ETV Bharat / state

డిసెంబర్‌ నుంచి మార్క్‌ఫెడ్​కు పౌష్టికాహార పంపిణీ బాధ్యతలు: సీఎం జగన్‌ - విలేజి క్లినిక్స్‌

CM JAGAN REVIEW : నవంబర్​​ నుంచి అంగన్​వాడీల ద్వారా అందించే పౌష్టికాహార పంపిణీని ప్రత్యేక యాప్‌ల ద్వారా పర్యవేక్షించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ఇందుకోసం అంగన్​వాడీలు, సూపర్​వైజర్లకు సెల్​ఫోన్ల పంపిణీని ప్రారంభించారు. సెల్​ఫోన్ ద్వారా నిరంతరం డేటాను అప్​డేట్ సహా పర్యవేక్షణ చేయాలని సీఎం ఆదేశించారు.

CM REVIEW ON ANGANWADI
CM REVIEW ON ANGANWADI
author img

By

Published : Oct 19, 2022, 5:47 PM IST

Updated : Oct 19, 2022, 8:09 PM IST

CM JAGAN REVIEW ON ANGANWADI: అంగన్​వాడీ ద్వారా అందుతున్న పోషకాహారం, తదితర అంశాలపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. స్కూళ్లు, అంగన్‌వాడీలకు సరఫరా చేసే ఆహారంపై నాణ్యత, పర్యవేక్షణకు మరిన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అంగన్‌వాడీలు, సూపర్‌వైజర్లు కలిపి దాదాపు 57వేలమందికి సెల్‌ఫోన్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. గర్భిణీలు, బాలింతలు, 6 సంవత్సరాల లోపు పిల్లలకు అందించే పౌష్టికాహారం, ఇతర సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. సమగ్ర పర్యవేక్షణ కోసం అంగన్‌వాడీ సెంటర్లకు, వర్కింగ్‌ సూపర్​వైజర్లకు సెల్‌ఫోన్లు అందిస్తున్నట్లు తెలిపారు.

డిసెంబర్‌ 1 నుంచి పౌష్టికాహార పంపిణీ బాధ్యతలను మార్క్‌ఫెడ్​కి అప్పగించాలని సీఎం నిర్ణయించి ఆదేశాలిచ్చారు. దీన్ని ప్రత్యేక యాప్‌ ద్వారా పర్యవేక్షణ చేయనున్నట్లు తెలిపారు. నవంబరు నుంచి గుడ్ల పంపిణీని యాప్‌ ద్వారా పర్యవేక్షణ చేయనున్నట్లు తెలిపారు. ఈ ఆహార నాణ్యత బాగుందా? లేదా? అనే దానిపై కేంద్ర ప్రభుత్వ సంస్థతో థర్డ్‌ పార్టీ పర్యవేక్షణ జరపాలన్నారు. క్వాలిటీ, క్వాంటిటీపై యాప్‌ల ద్వారా సమగ్ర పర్యవేక్షణ ఉండాలన్నారు. అంగన్‌వాడీల్లో పిల్లల ఆరోగ్య పరిస్థితులపై విలేజ్​ క్లినిక్స్‌, ఆశా వర్కర్ల ద్వారా వైద్యాధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

సచివాలయంలోని వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ కూడా ఇందులో భాగస్వామ్యం కావాలన్నారు. శారీరకంగా బలహీనంగా ఉన్న పిల్లలకు వైద్య సహాయం మాత్రమే కాకుండా, ఆ పిల్లలకు పౌష్టికాహారం మరింత అందించేలా తగిన ఆలోచనలు చేయాలన్నారు. దీనివల్ల రక్తహీనత, శారీరక బలహీనతలను మొదటి దశలోనే నివారించే అవకాశం ఉంటుందన్నారు. అంగన్‌వాడీలపై సూపర్‌వైజర్ల పర్యవేక్షణ జియోట్యాగింగ్‌ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

డిసెంబర్‌ నుంచి మార్క్‌ఫెడ్​కు పౌష్టికాహార పంపిణీ బాధ్యతలు

అంగన్​వాడీల పర్యవేక్షణ కోసం దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న సూపర్‌వైజర్ల నియామకాలను ప్రారంభించామన్న సీఎం.. దురదృష్టవశాత్తూ కోర్టుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. వీలైనంత త్వరగా ఈ పోస్టుల భర్తీని పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అక్టోబర్​లో నిర్దేశించుకున్న ప్రమాణాల ప్రకారం నూటికి నూరుపాళ్లు క్వాలిటీ, క్వాంటిటీ ఆహారం పిల్లలకు అందాలన్నారు. అంగన్‌వాడీల్లో టాయిలెట్ల పరిశుభ్రతపైనా దృష్టి పెట్టాలన్నారు.

సొంత భవనాల్లో కాకుండా అద్దె భవనాల్లో నడుస్తున్న అంగన్‌వాడీల్లో కూడా కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలని, ఈ మేరకు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. అంగన్‌వాడీల్లో నాడు - నేడు ద్వారా సమగ్రాభివృద్ధి చేయాలని, పాఠశాల విద్యాశాఖతో కలిసి ఈమేరకు నిర్ణయం తీసుకోవాలన్నారు. అంగన్‌వాడీల రూపురేఖలను సంపూర్ణంగా మార్చాలన్నారు. పిల్లలకు ఇచ్చే ఆహారం పాడవకుండా చూసేందుకు ఎలాంటి విధానాలు అనుసరించాలన్న దానిపై దృష్టి పెట్టాలని సూచించారు.

పిల్లలు రోజూ ఇచ్చే పాలు, గుడ్లులాంటివి పాడవకుండా నిల్వచేసే విధానాలపైనా కూడా దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి అంగన్‌వాడీల్లో ఫ్రిడ్జ్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. సుస్థిర ప్రగతి లక్ష్యాల్లో దేశంలోనే నంబర్‌వన్‌గా నిలవాలన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 19, 2022, 8:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.