ETV Bharat / state

అసంతృప్తి, అసమ్మతి ఉంటే మీరే చూసుకోవాలి కదా.. : సీఎం జగన్​ - ఆంధ్రప్రదేశ్​ తాజా వార్తలు

CM MEET WITH REGIONAL CO-ORIDANTORS : ఎమ్మెల్యేలు, పార్టీ నేతల్లో అసంతృప్తి, అసమ్మతి ఉంటే ప్రాంతీయ సమన్వయకర్తలే పరిష్కరించాలని.. సీఎం జగన్‌ అన్నారు. సీనియర్లని మీపై నమ్మకంతోనే బాధ్యత అప్పగించానని వారికి స్పష్టం చేసిన జగన్‌.. ఓనర్‌షిప్‌ తీసుకోవాలని నిర్దేశించారు. అదే సమయంలో గృహసారథులతో వాలంటీర్లను మమేకం చేయాలని.. పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

CM MEET WITH REGIONAL CO-ORIDANTORS
CM MEET WITH REGIONAL CO-ORIDANTORS
author img

By

Published : Apr 5, 2023, 6:58 AM IST

Updated : Apr 5, 2023, 11:57 AM IST

అసంతృప్తి, అసమ్మతి ఉంటే మీరే చూసుకోవాలి కదా..

CM MEET WITH REGIONAL CO-ORIDANTORS : మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలతో సోమవారం సమీక్షించిన ముఖ్యమంత్రి.. దానికి కొనసాగింపుగా మంగళవారం ప్రాంతీయ సమన్వయకర్తలతో భేటీ అయ్యారు. ఏ ఎమ్మెల్యేనూ వదులుకోనని సోమవారం నాటి సమావేశంలో చెప్పిన సీఎం.. ప్రాంతీయ సమన్వయకర్తలతో మాట్లాడినప్పుడూ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి, నియోజకవర్గాల్లో నాయకుల మధ్య అంతరాలున్నాయా అనే వివరాలపై చర్చించినట్లు సమాచారం.

ఆ రెండూ కీలకం: నియోజకవర్గాల్లో నాయకుల మధ్య అంతరాలుంటే మీరే చొరవ తీసుకుని పరిష్కరించండని సీఎం వారికి చెప్పినట్లు తెలిసింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని వచ్చే నాలుగు నెలల పాటు మరింత ఉద్ధృతంగా చేపట్టాలని నిర్ణయించామని, ఆ దిశగా ఎమ్మెల్యేలు పని చేసేలా పర్యవేక్షించాలని సీఎం వారికి నిర్దేశించారు. ఈ నెల 7 నుంచి 20 వరకు ‘జగనన్నే మన భవిష్యత్తు’ ప్రచార కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో విస్తృతంగా చేపట్టాలని.. ఇందులో భాగంగా ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ అనే స్టిక్కర్లను ఇళ్లకు, ఆ ఇళ్లలోని వారి ఫోన్లకు అతికించే కార్యక్రమాన్నీ పక్కాగా జరిగేలా చూడాల్సిన బాధ్యత మీదేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాలను ఏ ఎమ్మెల్యే ఎలా నిర్వహించారనే దానిపై ఎప్పటికప్పుడు నివేదించాలని చెప్పినట్లు సమాచారం. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న కార్యక్రమాలన్నీ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేందుకు ఈ రెండు కార్యక్రమాలూ కీలకమని సీఎం అన్నట్లు తెలిసింది.

అసంతృప్తి, అసమ్మతి ఉంటే మీరే చూసుకోవాలి: సచివాలయ సమన్వయకర్తలు, గృహసారథుల రూపంలో కింది స్థాయిలో చక్కటి యంత్రాంగం ఉందన్న సీఎం.. వాలంటీర్లను వారితో మమేకం చేయాలని ప్రాంతీయ సమన్వయకర్తలకు సూచించారు. నిర్దేశించిన కార్యక్రమాలన్నీ సజావుగా, సమర్థంగా ఆయా నియోజకవర్గాల్లో నడిచేలా సమన్వయకర్తలు పర్యవేక్షణ, సమన్వయ బాధ్యతలు స్వీకరించాలని.. సీఎం సూచించారు. నాయకుల్లో, ఎమ్మెల్యేల్లో అసమ్మతో, అసంతృప్తో ఉంటే మీరు చూసుకోవాలి కదా.. సీనియర్లు అని.. మీరు చేయగలరని నమ్మే కదా మీకు బాధ్యతలు అప్పగించిందని.. జగన్‌ ఆ పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలకు నిర్దేశించారు.

ఎన్నికలకు సంవత్సరమే సమయం ఉందన్న జగన్‌.. మీరు ఓనర్‌షిప్‌ తీసుకోవాలని వారికి దిశానిర్దేశం చేశారు. ఏ విషయాన్నైనా మీరు తనతో చర్చించవచ్చన్న జగన్​.. ఎప్పుడైనా తనని కలవవచ్చని.. పార్టీపరంగా మీరు తనకు టాప్‌ టీం అన్నారు. మీకు అప్పగించిన పరిధిలో పార్టీ నేతలను బలోపేతం చేయాల్సిన బాధ్యత మీదేనని.. వారికి వివరించారు. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్ది అందర్నీ ఒక్క తాటిపైకి తీసుకురావాలని.. అంతిమంగా అభ్యర్థులు మంచి మెజారిటీలతో గెలవాలని.. ఆ లక్ష్యం, సంకల్పంతో అందరూ పని చేయాలని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Apr 5, 2023, 11:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.