
ఆటోల్లో ప్రయాణించే మహిళలు, పిల్లల భద్రత కోసం అమలు చేయనున్న అభయం ప్రాజెక్టును ముఖ్యమంత్రి జగన్ నేడు ప్రారంభించనున్నారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ సమావేశం ద్వారా ఈ ప్రాజెక్టుకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. తొలుత విశాఖలో వెయ్యి ఆటోల్లో ప్రత్యేక పరికరాలను ఏర్పాటు చేయనున్నారు.
మీట నొక్కితే చాలు

ఈ ప్రాజెక్టులో భాగంగా ఆటోల్లో క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తారు. ప్రయాణికులు మొబైల్లో అభయం యాప్ ద్వారా కోడ్‌ను స్కాన్ చేస్తే ఆటో నెంబర్, డ్రైవర్ పేరు సహా ముఖ్యమైన వివరాలన్నీ ఉంటాయి. అలాగే ప్రత్యేకంగా ఆటోలో పానిక్ బటన్ ఉంటుంది. ఆటోలో ప్రయాణించే మహిళలు, పిల్లలు ఆపద ఉన్నట్లు భావిస్తే వెంటనే పానిక్ బటన్ నొక్కవచ్చు. అలా చేయగానే సంబంధిత సమాచారం కమాండ్ కంట్రోల్ రూమ్‌కు చేరుతుంది. ఆటో నుంచి హెల్ప్ అని శబ్ధం రావటంతో పాటు... కొంత దూరం వెళ్లగానే వాహనం ఆగిపోతుంది. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి లక్ష వాహనాల్లో ఈ తరహా సాంకేతికతను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇదీ చదవండి