CM Jagan Guntur Tour: ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 12న గుంటూరులో పర్యటించనున్నారు. విద్యానగర్ ఐటీసీ భవన సముదాయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలు హెలిప్యాడ్ కోసం పోలీస్ పెరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన స్థలాన్ని పరిశీలించారు. కలెక్టర్ వివేక్ యాదవ్‌తోపాటు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, ఎమ్మెల్యేలు మద్దాలి గిరిధర్ తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణతోపాటు భద్రత ఏర్పాట్లు పటిష్టంగా ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు.
ఇదీ చదవండి
సినిమాటోగ్రఫీ చట్టం మేరకు టికెట్ ధరను ప్రభుత్వమే నిర్ణయిస్తుంది: పేర్ని నాని