CM Jagan Cheating YSRCP Leaders : మోపిదేవి వెంకటరమణ రావు, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇద్దరూ ముఖ్యమంత్రి జగన్‌కు అండగా నిలిచేందుకు మంత్రి పదవులనూ త్యాగం చేశారు. వీరిలో ఒకరైతే మంత్రిగా ఉంటూ జగన్ అక్రమార్జనకు దోహదపడ్డారని కేసును కూడా ఎదుర్కొన్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డిది అయితే ముఖ్యమంత్రి కుటుంబానికి సన్నిహిత కుటుంబం. అంతేకాదు జగన్ కళ్లలో ఆనందం కోసం ప్రతిపక్ష నేతపై ఎడాపెడా కేసులు వేసి వేధింపులకూ పాల్పడ్డారు. తన కోసం ఇంత చేసిన వీరందరినీ జగన్ పక్కన పెట్టేశారు. వీరిలో ముగ్గురికి కనీసం వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే సీటు కూడా లేకుండా ఖాళీ చేసేశారు. సీఎంకు దగ్గరి వ్యక్తి అయిన మరో నాయకుడి పరిస్థితి ఇప్పుడు గాలిలో దీపంలా ఉంది.
YSRCP Mangalagiri MLA Alla Ramakrishna Reddy Resigns : నమ్మకంగా నిలబడిన వారికి జగన్ మేలు చేయకపోగా తన మార్క్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు. మంగళగిరి మున్సిపాలిటీ టీడీపీ మాజీ ఛైర్మన్ గంజి చిరంజీవిని స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణా రెడ్డితో గతేడాది పార్టీలోకి తెప్పించారు. చిరంజీవిని ఆర్కే వెంటబెట్టుకుని సీఎం వద్దకు తీసుకువచ్చారు. చిరంజీవిని పార్టీలో చేర్చుకున్న జగన్ ఆయన పరపతిని పెంచుతూ వైఎస్సార్సీపీ చేనేత విభాగం అధ్యక్ష పదవిని, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు, ప్రొటోకాల్ ఉండేందుకు ఆప్కో ఛైర్మన్ పదవిని వెంటవెంటనే కట్టబెట్టారు.
ఆశలు రేపి మొండిచేయి చూపి, ఆర్కేకే వైసీపీలో ఈ దుస్థితి ఉంటే మిగిలిన వారి పరిస్థితేంటి?
YSRCP Leaders Situation in AP : కొంతకాలంగా చిరంజీవి కార్యకలాపాలను ముమ్మరం చేశారు. ఇప్పుడు అదే చిరంజీవినే మంగళగిరి వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా అధికారికంగా ప్రకటించేశారు. ఇన్నాళ్లూ జగన్ కళ్లలో ఆనందం కోసం ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వ్యక్తిగతంగా, పార్టీ పరంగా హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కేసులు వేసి, కరకట్ట ఇంట్లో ఆయన ఎలా ఉంటారంటూ దానిపైనా వివాదం చేసిన ఆర్కే, తన సీటు కిందకే నీరొచ్చేసరికి తాను మోసపోయానని సంగతి గుర్తించి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు.
జగన్ ఆడుతున్న ఆటలో మోపిదేవి వెంకటరమణ ఏమైపోతాడో : వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మంత్రిగా ఉంటూ జగన్ అక్రమార్జనకు దోహదపడ్డారని కేసును ఎదుర్కోవడంతో పాటు దాదాపు ఏడాది పాటు జైల్లో ఉండి, ఆరోగ్యం దెబ్బతిని ఇబ్బందిపడ్డ మోపిదేవి వెంకటరమణ తర్వాత వైఎస్సార్సీపీను ఏర్పాటు చేశాక కూడా జగన్‌కు అండగానే ఇప్పటివరకూ ఉన్నారు. వైఎస్సార్సీపీకు మత్స్యకారుల మద్దతును కూడగట్టడంలో కీలకంగా వ్యవహరించారు. 2019లో ఆయన ఓడిపోయినా ఆయన్ను ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలోకి తీసుకుని జగన్ ప్రాధాన్యతనిచ్చారు. కానీ, మంత్రయిన సంవత్సరంలోపే ఆయను మంత్రిమండలి నుంచి తప్పించి రాజ్యసభకు పంపారు. ఎంపీగా వెళ్లేందుకు ఆయన వద్దు మొర్రో అన్నా బీసీలకు పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చిందని చెప్పుకోవడం కోసం ఆయన్ను బలవంతంగానే రాజ్యసభకు పంపారన్న చర్చ అప్పట్లో జరిగింది.
వైసీపీలో టికెట్‌లపై రాని స్పష్టత - వేర్వేరుగా ఉన్న పార్టీ, నేతల ఆలోచనలు
విధేయుడుగా ఉంటారు కాబట్టి ఆయన్ను ఎంచుకున్నారు. ఆ తర్వాత మోపిదేవి పట్టుబట్టి పోరాడగా రేపల్లె పార్టీ ఇన్‌ఛార్జిగా నియమించారు. ఆ ప్రాంతానికి చెందిన డాక్టర్ ఈవూరు గణేష్‌ను పార్టీలోకి తీసుకురావాలని మోపిదేవికి చెప్పారు. గత నెలల్లో మోపిదేవి గణేష్‌ను తీసుకురావడం, ఆయన్ను సీఎం వైఎస్సార్సీపీలో చేర్చుకోవడం జరిగిపోయింది. అదే గణేష్‌ను రేపల్లెలో పార్టీ సమన్వయకర్తగా నియమించి, మోపిదేవిని ఖాళీ చేశారు. ఇదేంటని మోపిదేవి మద్దతుదారులు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిని అడగా 'ఆయన్ను స్టార్ క్యాంపెయినర్‌గా ఉపయోగించుకోనున్నాం'అని చెప్పారు. 'ఉన్న ఊర్లో ఖాళీ చేసి, రాష్ట్రమంతా తిప్పి ఏం చేస్తారు'అంటూ మోపిదేవి వర్గీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
సీటు త్యాగం చేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు రామచంద్రపురం దక్కుతుందా? : మంత్రి పదవిని త్యాగం చేసి జగన్ వెంట నిలిచిన వ్యక్తి పిల్లి సుభాష్ చంద్రబోస్. 2019 ఎన్నికలకు ఏడాది ముందు వరకు ఆయన సొంత నియోజకవర్గ రామచంద్రపురంలో పార్టీ ఇన్‌ఛార్జిగా కొనసాగారు. అయితే పార్టీలో కొన్ని సర్దుబాట్లలో భాగంగా చెల్లుబోయిన వేణుగోపాకృష్ణకు రామచంద్రపురం నుంచి టికెట్ ఇస్తామని పార్టీ అధినాయకత్వం చెప్పడంతో పార్టీ విధేయుడుగా ఉండే బోస్ సరేననే తన సీటును త్యాగం చేశారు. ఎన్నికలకు 15 రోజుల ముందు మండపేటలో పార్టీకి ఒక అభ్యర్థి కావాలి అక్కడకు వెళ్లమంటే బోస్ వెళ్లిపోయారు. అక్కడ ఓడిపోయారు.
అయితే అప్పటికే ఆయన ఎమ్మెల్సీగా ఉన్నందున ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కానీ, ఏడాదిలోపే మంత్రిగా తొలగించి రాజ్యసభకు పంపారు. రామచంద్రపురం గెలిచిన వేణుని మంత్రిని చేశారు. అయితే మంత్రి వేణు తన వర్గాన్ని ఇబ్బంది పెడుతున్నారని బోస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన వర్గాన్ని కాపాడుకునేందుకు సీఎం వద్దకు వెళ్లినా ఆయనకు సాంత్వన లభించలేదు. గతంలో సీటు త్యాగం చేసిన బోస్‌కు ఇప్పుడు రామచంద్రపురం దక్కుతుందా లేదా అనేది తేలడం లేదు.
బాలినేని శ్రీనివాసరెడ్డి పయనం ఏ నియోజకవర్గానికి : బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రికి దగ్గరి వ్యక్తి. ఒక రకంగా బంధువు కూడా జగన్‌కు అండగా నిలిచేందుకు తన మంత్రి పదవిని త్యాగం చేసి వచ్చారు. అంతకుముందు మంత్రిగా ఉన్నపుడు కూడా జగన్‌కు అవసరమైన పనులనూ చక్కబెట్టారు. 2019లో జగన్ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. ప్రభుత్వంలో నెం.2లాంటివారు, పార్టీలో ముఖ్యులు వారికి కావాల్సినవన్నీ చేసుకుంటున్నారని, తానూ ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఏదో ఒకటి ఇవ్వాలని సీఎంను అడిగిన ఆయన తర్వాత తన శాఖలోనే ఒక పెద్ద ప్రాజెక్టును తన కుటుంబ సభ్యులకు ఇప్పించుకునే ప్రయత్నం చేశారు. అందులో ఆయనకు సుమారు 35కోట్లకుపైగా మిగులుతుందని అప్పట్లో ప్రచారం జరిగింది.
అంతా ఓకే అయిన సమయంలో 'ప్రభుత్వంలోని నెంబరు-2 కుటుంబ సభ్యుడు వచ్చి ఆ ప్రాజెక్టు మేం చేస్తాం, మీకు ఇవ్వాల్సింది నేనే ఇచ్చేస్తా'అని చెప్పి తీసుకున్నారు. కానీ, మంత్రికి దక్కాల్సిందది మాత్రం అందలేదు. కొన్నాళ్లకు ఆయనకు మంత్రి పదవిపోయింది. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం, పార్టీ పెద్దల వ్యవహరాలపైనా ఆయన వ్యంగ్యంగా చేస్తున్న వ్యాఖ్యలకు ఆయనలో అసంతృప్తే కారణమంటున్నారు. ఇప్పుడు ఆయన సొంత నియోజకవర్గంలో పోటీ చేసే పరిస్థితి ఉంటుందా? మారుస్తారా? లేదా మొత్తానికే పక్కన పెడతారా అనే చర్చ పార్టీలో కొనసాగుతోంది.
Balineni వెనక్కి తగ్గలేను.. పార్టీలో అవమానం.. వ్యతిరేకవర్గం.. సీఎం దృష్టికి బాలినేని!