గుంటూరు జిల్లా చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన తాడేపల్లి సీతారామయ్య అనే వస్త్ర వ్యాపారి తమను నమ్మించి అధిక మొత్తంలో సుమారు 7 కోట్ల 30 లక్షలు అప్పుగా తీసుకున్నాడని గ్రామస్థులు ఆరోపించారు. గ్రామస్థులు సీతారామయ్యను అప్పు తీర్చమని కోరితే.. వైద్యపరికరాల వ్యాపారం చేసే పుల్లా సాహెబ్‌కు డబ్బిచ్చానని.. అతను పారిపోయాడని తమను మోసం చేసి డ్రామా ఆడుతున్నాడని పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని, పోలీసులు తమ డబ్బు తిరిగి ఇప్పించాలని కోరారు. లేకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని ఠాణా ఎదుట గ్రామస్థులు ఆందోళనకు దిగారు.
ఇదీ చదవండీ... విశాఖలో మాజీ ఎంపీ సబ్బంహరి ఇంటి దగ్గర ఉద్రిక్తత