గుంటూరు పరిసరాల పరిశుభ్రం, పర్యావరణ పరిరక్షణ అంశాలపై ఈ నెల 18న పోటీలు.. నిర్వహిస్తున్నట్లు నగర కమిషనర్ చల్లా అనురాధ తెలిపారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఈ పోటీలను నిర్వహింస్తున్నట్లు ఆమె వెల్లడించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2021లో గుంటూరు నగరం కూడా పోటీ పడుతుందని ఆమె అన్నారు. నగరంలో ఇప్పటికే తడి పొడి చెత్త విభజన, హోం కంపోస్ట్ తయారీ కిచెన్, టెర్రస్ గార్డెన్స్ వంటి అంశాల్లో పలు చర్యలు తీసుకున్నామన్నారు.
మన గుంటూరు-స్వచ్చ గుంటూరు నినాదంలో భాగంగా.. ప్రజలకు అవగాహన కల్పించేదుకు పాటల పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నగరాన్ని స్వచ్ఛంగా తీర్చిదిద్దటం, పరిశుభ్రత వల్ల ఉపయోగాలు, పర్యావరణ పరిరక్షణ అంశాల మీద ఔత్సాహికులు పాటలు రాసి పోటీల్లో పాల్గొనాలని వివరించారు. కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన వారికి మెుదటి బహుమతిగా 10,116 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 5,116 రూపాయలు, తృతియ బహుమతిగా 1,116 రూపాయలు అందిస్తామని.. అలాగే మరో ఐదుగురికి కన్సోలేషన్ బహుమతి, పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండీ.. 2013 - 14 లెక్కల ప్రకారమే పోలవరం వ్యయం: కేంద్రం