రియల్ ఎస్టేట్, వస్త్ర వ్యాపారం పేరుతో గుంటూరు ద్వారక నగర్లోని దంపతులు మోసం చేశారని ఆరోపిస్తూ.. బాధితులు గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. వ్యాపారం పేరుతో సుమారు 150 మంది నుంచి 18 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి.. వ్యాపారి సాంబశివరావు దంపతులు నిలువున ముంచారంటూ బాధితులు ఆరోపించారు. భవిష్యత్తు అవసరాల కోసం తాము దాచుకున్న సొమ్మును ప్రామిసరీ నోట్లు రాయించుకుని మరీ దంపతులు తీసుకున్నారని బాధితులు వాపోయారు.
తమ సొమ్ము ఇవ్వాలని పలు మార్లు కోరినప్పటికీ ప్రయోజనం కనిపించలేదని.. పైగా తమపై ఎదురుదాడి చేస్తున్నారని బాధితులు తెలిపారు. పోలీసు అధికారులు ఈ ఘటనపై జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలంటూ బాధితులు కోరారు.
ఇదీ చదవండి: