గుంటూరులోని నల్లపాడుకు చెందిన యాగయ్య నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం కోసం 3 లక్షల 30 వేలు తీసుకున్నాడు సతీశ్ వర్మ. యాగయ్య చేతిలో నకిలీ నియామకపత్రం పెట్టాడు. అది తీసుకుని సచివాలయానికి వెళ్లిన యాగయ్యకు అక్కడ అలాంటి ఉద్యోగమేదీ లేదని తెలిసి షాక్ అయ్యాడు. ఆయన తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు సతీష్ వర్మను అరెస్టు చేశారు. ఈ మోసంలో పాలుపంచుకున్న వంశీకృష్ణ, షేక్ బాజీ, మేడా వెంకట్రామయ్యను కూడా అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. సౌజన్య, కిరణ్ అనే ఇద్దరు పరారీలో ఉన్నట్లు తుళ్లూరు సీఐ అక్కరాజు శ్రీహరి తెలిపారు.
ఇదీ చదవండి: దర్యాప్తు బాధ్యత పోలీసులదా? ప్రతిపక్షానిదా?: చంద్రబాబు