మొదటి రోజున రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ నేతలతో సమావేశం మొదలైంది. రాజమహేంద్రవరం పట్టణం, రాజమహేంద్రవరం గ్రామీణం, రాజానగరం, అనపర్తి, నిడదవోలు, కొవ్వూరు, గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఈ సమీక్షకు హాజరయ్యారు. ఈ నియోజకవర్గాల్లో పార్టీ ముఖ్య నేతలతోపాటు... ఎన్నికల సమయంలో పార్టీ పరిశీలకులుగా పని చేసిన వారూ సమావేశానికి హాజరయ్యారు.
తెదేపా నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం కొనసాగుతోంది. ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారిని చంద్రబాబు అభినందించారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని గుర్తించాలని నేతలకు సూచించారు. నియోజకవర్గాల వారీగా జాబితాలు తయారుచేయాలని ఆదేశించారు. సమావేశంలో కార్యకర్తలకు మాట్లాడే అవకాశం ఇచ్చిన చంద్రబాబు... అభిప్రాయాలు స్వేచ్ఛగా వెల్లడించాలని సూచించారు. పార్టీ కోసం సమయం కేటాయించాలని చంద్రబాబును... రాజానగరం కార్యకర్త కోరగా... ఇకనుంచి పార్టీకి రోజూ 3 గంటల చొప్పున కేటాయిస్తానని చంద్రబాబు హామీఇచ్చారు. కొత్త రాష్ట్రమైనందున ఐదేళ్లుగా అభివృద్ధిపైనే ఎక్కువగా దృష్టి సారించానని వెల్లడించారు. మళ్లీ తెదేపా అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి...