వైకాపా దాడులు నిజం కాకపోతే... బాధితులు గ్రామాలు వదిలేసి గుంటూరు పునరావాస శిబిరంలో ఎందుకుంటున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. పల్నాడు గ్రామాల్లో బోసిపోయిన ఇళ్లు, బీడు పడ్డ భూములు... అన్నీ పుకార్లు అయితే పునరావాస శిబిరంలో ఉన్నది వైకాపా నేతలా అని చంద్రబాబు నిలదీశారు. బాధితులు సొంతూర్లను వదిలేసి పరాయి గ్రామాల్లో తలదాచుకోవడం ఎందుకన్నారు. కళ్లెదుట కనిపించే నిజాలను వైకాపా నేతలు చూడలేకపోతున్నారని విమర్శించారు. బాధితుల కన్నీళ్లెందుకు తుడవలేకపోతున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. బాధితుల్లో భరోసానిచ్చేందుకు, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, బాధితుల హక్కుల కోసం ఆత్మకూరులో పర్యటిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజాసంఘాలు, అభ్యుదయవాదులు బాధితులకు సంఘీభావంగా కదిలిరావాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి : 11న ఛలో ఆత్మకూరుతో.. వైకాపా బాధితుల్లో ధైర్యం పెంచుతాం