ETV Bharat / state

మూడున్నరేళ్ల తర్వాత జగన్​కు బీసీలు గుర్తుకు వచ్చారా..?: చంద్రబాబు - బాపట్ల జిల్లా చంద్రబాబు పర్యటన

Chandrababu Guntur Tour: ముఖ్యమంత్రి జగన్​కు మూడున్నరేళ్ల తర్వాత గుర్తుకు వచ్చారా అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. వైకాపా బీసీ సభకు జనాలకు బలవంతంగా తరలించారని.. రాకపోతే పథకాలు కట్​ చేస్తామని బెదిరించారని ఆరోపించారు. పిల్లల భవిష్యత్​ మంచిగా ఉండాలంటే.. సైకో పాలన పోయి సైకిల్​ పాలన రావాలని చంద్రబాబు సూచించారు.

Chandrababu
చంద్రబాబు
author img

By

Published : Dec 8, 2022, 5:48 PM IST

Updated : Dec 8, 2022, 7:10 PM IST

Chandrababu Guntur Tour: బీసీ సభకు బలవంతంగా జనాన్ని తీసుకువెళ్లారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు.. మూడున్నర ఏళ్ల తర్వాత జగన్​కు బీసీలు గుర్తుకు వచ్చారా అని ఎద్దేవా చేశారు. బస్సులు పెట్టి మరి బీసీ సభకు జనాన్ని తరలించారన్నారు. నాకు కొత్తగా సీఎం పదవి అవసరమా అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రం, పిల్లల బంగారు భవిష్యత్తు కోసమే వచ్చానని పేర్కొన్నారు. సైకో పాలన పోవాలి.. సైకిల్​ పాలన రావాలని చంద్రబాబు తెలిపారు.

పొన్నూరు నియోజకవర్గంలో చంద్రబాబు

అంతకుముందు పొన్నూరు నియోజకవర్గంలో చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. పెదకాకానిలో ప్రవేశించగానే టీడీపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. అక్కడినుంచి జాతీయ రహదారి మీదుగా బుడంపాడు చేరుకున్నారు. బుడంపాడు వద్ద చంద్రబాబును గజమాలతో టీడీపీ నాయకులు ఘనంగా స్వాగతించారు. బుడంపాడు నుంచి బైక్ ర్యాలీతో చంద్రబాబు పర్యటన ముందుకు సాగింది. నారాకోడూరులో చంద్రబాబు పర్యటనకు టీడీపీ కార్యకర్తలతో పాటు జనం భారీగా తరలివచ్చారు. ఈరోజు నుంచి మూడు రోజుల పాటు గుంటూరు, బాపట్ల జిల్లాల్లో చంద్రబాబు పర్యటన కొనసాగనుంది.

ఇవీ చదవండి:

Last Updated : Dec 8, 2022, 7:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.