Chandrababu anticipatory bail hearing adjourned in high court: స్కిల్ కేసులో పూర్తి స్థాయి బెయిల్ మంజూరు నేపధ్యంలో.. చంద్రబాబు పై వైసీపీ సర్కార్ నమోదు చేసిన మిగిలిన కేసుల విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకకొంది. స్కిల్ కేసు మాదిరే ఈ కేసుల్లోను కడిగిన ముత్యంలా బాబు బయటపడతాడని.. టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అటు వైసీపీ నేతలతో పాటు సీఐడీ అధికారులు.. చంద్రబాబు బెయిల్ ఇవ్వొద్దనే రీతిలో సీఐడీ తన వాదనలను వినిపిస్తోంది. ఆరోపణలు కాదు ఆధారాలను చూపాలంటూ.. టీడీపీ న్యాయవాదులు వాదిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇవాళ హైకోర్టులో లిక్కర్, ఉచిత ఇసుక కేసుల్లో జరిగిన వాదోపవాల్లో అనేక అంశాలను ఇరు వార్గాలు ప్రస్తావించాయి. ప్రజల కోసమే చంద్రబాబు ఉచిత ఇసుక విధానం తీసుకోచ్చారని ఆయన తరఫు న్యాయవాది హైకోర్టుకు నివేదించారు. మద్యం కేసులోనూ చంద్రబాబుపై సీఐడీ మోపిన అభియోగాలకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. మద్యం కేసును రేపటికి, ఇసుక కేసును ఎల్లుండికి హైకోర్టు వాయిదా వేసింది.
TDP Sand Satyagraham Protest: టీడీపీ ‘ఇసుక సత్యాగ్రహం’.. ముఖ్య నేతలు గృహ నిర్బంధం
ఉచిత ఇసుక విధానం: ఇసుక కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రజల కోసమే 2016లో తెలుగుదేశం ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చిందని... చంద్రబాబు Chandrababu) తరఫు న్యాయవాది సిద్ధార్థ అగర్వాల్ కోర్టుకు తెలిపారు. ఈ విధానంతో ఎవరూ వ్యక్తిగత లబ్ధి పొందలేదని వాదనలు వినిపించారు. ఇళ్లు కట్టుకునే వారికి అవసర ప్రాతిపదికన ఇసుక సరఫరా జరిగిందని పేర్కొన్నారు. బడా వ్యాపారులు, ఇతరలు సొమ్ము చేసుకోకుండా.... నియంత్రించారని తెలిపారు. ఇసుక డంప్‌లు చేయకుండా ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను కూడా నియమించినట్లు కోర్టుకు నివేదించారు. 2019లో ప్రభుత్వం మారాక 5 నెలల వరకూ ఇదే విధానాన్ని కొనసాగించారని గుర్తు చేశారు. ఇసుక విధానంలో లోపం ఉంటే.. 2023 అక్టోబర్ వరకూ కేసు ఎందుకు నమోదు చేయలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇసుక అక్రమాలపై బీజేపీ చేసిన ఆరోపణలను మరల్చేందుకు ఈ కేసు పెట్టారని వాదనలు వినిపించారు. ఇది మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయమని... అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఉచిత ఇసుక విధానం తీసుకువచ్చారని వివరించారు. ఈ కేసులో చంద్రబాబుకు 17 ఏ వర్తిస్తుందని తెలిపారు.
ఇసుక కేసు - హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ - రేపు విచారణ!
మద్యం పాలసీ: మద్యం కేసులోనూ చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. క్యాబినేట్ నిర్ణయానికి విరుద్ధంగా మద్యం పాలసీ (Liquor Policy)ని తీసుకొచ్చారని సీఐడీ (CID) తరఫు న్యాయవాది వాదించారు. దాని వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా నష్టం వచ్చిందని పేర్కొన్నారు. క్యాబినెట్ నిర్ణయం ప్రకారం వెళ్ళాలి లేదా సవరించి ముందుకు వెళ్లాలని, అలా కాకుండా వెళ్తే అవినీతి విస్తృతం అవుతుందన్నారు. ఎక్సైజ్ పాలసీనీ 5 నుంచి 10 శాతానికి ఉద్దేశ పూర్వకంగా మార్చారని కోర్టుకు నివేదించారు. కొంతమందికే లబ్ది కలిగేలా మార్పులు చేసి.... లైసెన్స్ ఇచ్చారని తెలిపారు. సీఐడీ చేసిన అభియోగాలపై ఎలాంటి ఆధారాలు లేవనీ చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టుకు నివేదించారు. రాజకీయ కక్షతో వరుస కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు. ఈ కేసుకు 17ఏ నిబంధన వర్తిస్తుందని పేర్కొన్నారు.
ఇసుక పాలసీలో అవకతవకలు జరిగాయని చంద్రబాబుపై మరో కేసు నమోదు చేసిన సీఐడీ