గుంటూరు జిల్లా తెనాలిలోని బుర్రిపాలెం రోడ్డు సమీపంలోగల 'శ్రీ మహాత్మ సేవ శాంతి ఆశ్రమం' శాశ్వత భవన నిర్మాణం కోసం దాతలు ఆర్థిక సాయం చేశారు. చాగంరెడ్డి కొండారెడ్డి, సరోజిని జ్ఞాపకార్థం వారి కుమారులు మూడు లక్షల రూపాయలు విరాళాన్ని అందించారు.
చాగంరెడ్డి సుందరరామిరెడ్డి, బాలకృష్ణరెడ్డి, రఘువీరారెడ్డిలు ఈ సొమ్మును ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదగా వృద్ధాశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారికి అందజేశారు. తన వంతు ఆశ్రమానికి సాయాన్ని చేస్తానని తమ వంతు ఆశ్రమానికి సాయం ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:
కొవిడ్ ఆస్పత్రులను సందర్శించకుండా.. తెదేపా నేతల గృహ నిర్బంధం