ETV Bharat / state

Central Team In AP: మిర్చి పంటపై 'తామర పురుగు' పంజా..కేంద్ర బృందం పరిశీలన - గుంటూరులో కేంద్ర బృందం పర్యటన

Central Team Examined Chilli Crop: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలోని తిక్కిరెడ్డిపాలెంలో మిర్చి పంటలను కేంద్ర బృందం పరిశీలించింది. పంటను తామర పురుగు పీడిస్తుందని.. క్షేత్రస్థాయిలో రైతుల దగ్గర నుంచి తీసుకున్న వివరాలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కార్యాలయంలో నివేదిక అందిస్తామని కేంద్ర బృంద సభ్యులు స్పష్టం చేశారు.

మిర్చి పంటపై 'తామర పురుగు' పంజా
మిర్చి పంటపై 'తామర పురుగు' పంజా
author img

By

Published : Jan 4, 2022, 5:43 PM IST

Chilli Cultivation: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలోని తిక్కిరెడ్డిపాలెంలో మిర్చి పంటలను కేంద్ర బృందం పరిశీలించింది. మిర్చి పంటను పీడిస్తున్న తామర పురుగు ఉద్ధృతికి గల కారణాలపై ఆరా తీశారు. ఎకరం పొలానికి ఇప్పటివరకు రూ. 90 వేలు పెట్టుబడి పెట్టామని.. తామర పురుగు కారణంగా ఒక్క క్వింటా పంట కూడా చేతికి రాలేదని రైతు శ్రీనివాస్ వాపోయాడు. పురుగు కట్టడికి ఉద్యాన శాఖ అధికారులు సైతం నివారణ చర్యలు సూచించలేకపోయారన్నారు. పరిస్థితి ఇలానే ఉంటే ఆత్మహత్యలే తప్పా మరో దారి కనిపించటం లేదని వాపోయారు.

మిర్చిలో తామర పురుగు ఉద్ధృతిని పరిశీలించామని..,సమస్య తీవ్రంగానే ఉందని కేంద్ర బృంద సభ్యులు తెలిపారు. రైతులు నష్టపోతున్నట్లు గమనించామన్నారు.

తామర పురుగు ద్వారా రైతులు 75 శాతం పంట నస్టపోతున్నారు. ఈ ఏడాది తామరపురుగు ఉద్ధృతిని ఎక్కువగా గమనించాం. వాటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఆలోచిస్తున్నాం. ఈ పురుగు వలన ఇతర పంటలకు నష్టం కలగకుండా చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నాం. క్షేత్ర స్థాయిలో రైతుల దగ్గర నుంచి తీసుకున్న వివరాలను కేంద్ర వ్యవసాయ మంత్రి కార్యాలయంలో నివేదిక అందిస్తాం - డాక్టర్ ఏబీ రేమ శ్రీ , రీసెర్చ్ అండ్ ఫైనాన్స్ స్పైస్ బోర్డు డైరెక్టర్

ఇదీ చదవండి

CM Jagan Delhi Tour: ముగిసిన సీఎం జగన్‌ దిల్లీ పర్యటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.