PETROL RATES IN AP : పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలో ఆంధ్రప్రదేశ్‌లోనే అధికంగా ఉన్నాయని కేంద్రం తెలిపింది. తర్వాతి స్థానంలో తెలంగాణ ఉన్నట్లు వెల్లడించింది. కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి గురువారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఆగస్టు నుంచి నవంబరు మధ్యకాలంలో ఏపీలో పెట్రోల్ ధర లీటరుకు 111 రూపాయల 87 పైసలు, డీజిల్ ధర లీటరుకు 99 రూపాయల 61పైసలు ఉందన్నారు. మరే రాష్ట్రంలోనూ ఈ ధరలు లేవన్నారు.
ఆంధ్రప్రదేశ్ పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లో ఏపీతో పోల్చితే ధరలు తక్కువగా ఉన్నాయన్నారు. దేశంలో అత్యల్ప ధరలు అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నట్లు తెలిపారు. అక్కడ లీటర్ పెట్రోల్ 84 రూపాయల10 పైసలకు, డీజిల్ 79 రూపాయల74పైసలకి విక్రయిస్తున్నారని తెలిపారు.
ఇవీ చదవండి: