ETV Bharat / state

తెదేపా అభ్యర్థి ఇంట్లో అక్రమ మద్యంపై ఎస్​ఈసీకి చంద్రబాబు లేఖ - ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ

గుంటూరు జిల్లా తెనాలిలో తెదేపా అభ్యర్థి ఇంట్లో అక్రమ మద్యంపై చంద్రబాబు ఎస్​ఈసీకి లేఖ రాశారు. మద్యం పెట్టిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

తెదేపా అభ్యర్థి ఇంట్లో అక్రమ మద్యంపై ఎస్​ఈసీకి చంద్రబాబు లేఖ

author img

By

Published : Mar 13, 2020, 4:28 PM IST

గుంటూరు జిల్లా తెనాలిలో తెదేపా అభ్యర్థి ఇంట్లో అక్రమంగా మద్యం పెట్టారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. పోలీసులు నేరుగా వాటర్ ట్యాంకర్‌ దగ్గరకు వెళ్లి మద్యం వెలికితీశారని పేర్కొన్నారు. దుండగులు మద్యాన్ని ఉంచిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయని... తన ఇంట్లో మద్యం పెట్టారని యజమాని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని చంద్రబాబు తెలిపారు. వైకాపా నేతలు, పోలీసులు, అబ్కారీ సిబ్బంది కుమ్మక్కయ్యారని ఆరోపించారు. మద్యం పెట్టిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మాచర్ల, ధర్మవరంలో నామపత్రాల చించివేతపైనా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని ప్రజలే కాపాడాలి: యనమల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.