తెదేపా నేత యరపతినేనిపై సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కోణంకి, కేసనుపల్లి, నడికుడిలో అక్రమ మైనింగ్ ఆరోపణలపై సీబీఐ విచారణ చేయనుంది. మాజీ ఎమ్మెల్యే యరపతినేని సహా పలువురిపై ఇప్పటికే కేసుల నమోదయ్యాయి. అక్రమ మైనింగ్‌పై విచారణ జరపాలని సీబీఐని ప్రభుత్వం కోరింది. అక్రమ మైనింగ్‌పై ఇప్పటికే 18 కేసులు నమోదు చేసినట్లు నోటిఫికేషన్‌లో వెల్లడించింది.
ఇదీ చదవండి: సీబీఐ పునరుద్ధరణ తర్వాత.. మెుదటి కేసు యరపతినేనిదే!