ETV Bharat / state

గుంటూరులో పెరుగుతున్న కేసులు.. పేరుకుంటున్న వాహనాలు - గుంటూరులో వాహనాలపై కేసులు వార్తలు

నిబంధనలకు విరుద్ధంగా మద్యం రవాణా చేస్తున్న వాహనాలపై గుంటూరు జిల్లాలో కేసులు పెరుగుతున్నాయి. అధికారులు చెక్​పోస్ట్​లు పెట్టి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలనుకున్న కుదరడం లేదు.. రోజురోజుకూ ఇతర రాష్ట్రాల నుంచి తరలిస్తుండగా వాహనాలు సీజ్ చేస్తూ వచ్చారు. నిబంధనల మేరకు యజమానులకు వాహనాలు అప్పగించాలని న్యాయస్థానం 2 నెలల క్రితం ఉత్తర్వులు ఇచ్చిన.. ఎక్సైజ్‌ శాఖ, ఎస్‌ఈబీ అధికారుల మధ్య సమన్వయం కొరవడటంతో కోర్టు ఉత్తర్వులు అమలుకు నోచుకోలేదు. దీంతో పోలీస్ స్టేషన్​లో వాహనాలు పెరిగిపోయాయి.

vehicles cases in Guntur
గుంటూరులో వాహనాలపై కేసులు
author img

By

Published : Dec 3, 2020, 9:26 AM IST

ఇతర రాష్ట్రాల నుంచి మద్యం విక్రయిస్తూ పట్టుబడుతున్న కేసులు గుంటూరు జిల్లా వ్యాప్తంగా పెరుగుతున్నాయి. అధికారులు దాడులు చేసి మద్యం నిల్వలు పట్టుకుని వాహనాలు సీజ్‌ చేస్తున్నా.. అక్రమార్కులు భయపడటం లేదు. ఈ క్రమంలోనే కేసుల సంఖ్యతో పాటు సీజ్‌ చేసిన వాహనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. స్టేషన్లలో గుట్టలుగా దర్శనమిస్తున్నాయి. లక్షల విలువ చేసే ద్విచక్ర వాహనాలు, కార్లు, భారీ వాహనాలు సీజ్‌ చేస్తున్నా అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట పడడం లేదు. కిరాణా, కిళ్లీ దుకాణాలు, చికెన్‌ సెంటర్లు వద్ద బహిరంగంగా ఇతర రాష్ట్రాల మద్యం విక్రయిస్తున్నారు. గొలుసు దుకాణాల్లోనూ ఇదే పరిస్థితి. జిల్లాకు తెలంగాణ, కర్ణాటక, గోవా, పాండిచ్చేరి తదితర రాష్ట్రాల నుంచి మద్యం దిగుమతి అవుతోంది. పల్నాడులో భూమిలో పాతిపెట్టిన తెలంగాణ మద్యం నిల్వలను అధికారులు తవ్వించి వెలికి తీశారు. ఎస్‌ఈబీ, ఎక్సైజ్‌ పోలీసులు నిఘా కట్టుదిట్టం చేయకపోవడంతో మద్యం సరఫరా యథేచ్ఛగా సాగుతోంది.

1688 కేసులు.. 555 వాహనాలు సీజ్‌: జిల్లాలో అక్రమార్కులు మందు సరఫరాను తమ ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చి విక్రయిస్తుండగా నిందితులపై అధికారులు దాడులు చేసి 1688 కేసులు నమోదు చేసి 555 వాహనాలు సీజ్‌ చేశారు. జిల్లాలో గుంటూరు, తెనాలి, నరసరావుపేట ఎక్సైజ్‌ సబ్‌ డివిజన్లు ఉండగా వీటి పరిధిలో 20 ఎక్సైజ్‌ పోలీసు స్టేషన్లు ఉన్నాయి. మూడు డివిజన్ల పరిధిలో ఆరు నెలల వ్యవధిలో 555 వాహనాలు సీజ్‌ చేశారు. వీటిలో అత్యధికం నరసరావుపేట డివిజన్‌ పరిధిలోనే ఉన్నాయి. 1688 కేసులు నమోదు చేసి 13,875 లీటర్ల అక్రమ మద్యం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా నాటు సారా తయారు చేస్తుండగా 684 కేసులు నమోదు చేసి 447 మందిని అరెస్టు చేశారు.

అక్రమ మద్యం అరికడతాం

జిల్లాకు ఇతర రాష్ట్రాల నుంచి మద్యం వస్తున్న విషయాన్ని ఎస్‌ఈబీ అడిషనల్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ దృష్టికి ‘న్యూస్‌టుడే’ తీసుకెళ్లగా నిఘా కట్టుదిట్టం చేసి అక్రమ మద్యాన్ని అరికడతామని చెప్పారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల మద్యాన్ని కట్టడి చేస్తామన్నారు. అనధికార వ్యాపారాన్ని పూర్తిగా అరికట్టి గ్రామాల్లో గొలుసు దుకాణాలు లేకుండా చూస్తామని పేర్కొన్నారు. సీజ్‌ చేసిన వాహనాలు త్వరలో వేలం నిర్వహిస్తామని చెప్పారు. మద్యంతో పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.

వాహనాల వేలంలో జాప్యం

ఎక్సైజ్‌, ఎస్‌ఈబీల మధ్య సమన్వయం కొరవడడంతో వందల వాహనాలు స్టేషన్లకే పరిమితమయ్యాయి. 2020 మే16 నుంచి గత నెల 26 వరకు వందల వాహనాలు సీజ్‌ చేసి ఎక్సైజ్‌ స్టేషన్లకు తరలించారు. అక్రమంగా మద్యం తరలిస్తుండగా సీజ్‌ చేసిన వాహనాలు నిబంధనల మేరకు యజమానులకు అప్పగించాలని న్యాయస్థానం రెండునెలల క్రితం ఉత్తర్వులు ఇచ్చింది. ఎక్సైజ్‌ శాఖ, ఎస్‌ఈబీ అధికారుల మధ్య సమన్వయం కొరవడటంతో ఇంతవరకు న్యాయస్థానం ఉత్తర్వులు అమలుకు నోచుకోలేదు. దీంతో ఎక్సైజ్‌ స్టేషన్ల ప్రాంగణాలు సీజ్‌ చేసిన వాహనాలతో నిండిపోయి ఉన్నాయి. భవిష్యత్తులో కేసులు నమోదు చేస్తే సీజ్‌ చేసిన వాహనాలు ఎక్కడ భద్రపర్చాలో తెలియక స్థానిక అధికారులు తల పట్టుకుంటున్నారు.

ఇదీ చూడండి:

'అవినీతి జరిగిందని.. ఎందుకు రుజువు చేయలేకపోయారు?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.