ETV Bharat / state

నకిలీ పత్రాలతో 'వైఎస్​ఆర్ ఆసరా'.. లబ్ధిదారుడిపై కేసు నమోదు - జీజీహెచ్​లో ఆరోగ్యశ్రీ తప్పుడు పత్రాలతో వైఎస్​ఆర్ ఆసరా

గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో నకిలీ ఆరోగ్యశ్రీ పత్రాల ద్వారా ఓ వ్యక్తి రూ. 30 వేలు లబ్ధి పొందడం కలకలం సృష్టించింది. ఆయా పత్రాల్లో అధికారుల దొంగ సంతకాలు ఉండటంతో.. జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ జయరామకృష్ణ కొత్తపేట పోలీసులను ఆశ్రయించారు. మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.

fake documents for ysr asara, arogyasri fake documents upload at ggh
జీజీహెచ్​లోఆరోగ్యశ్రీ నకిలీ పత్రాల అప్​లోడ్​, తప్పుడు పత్రాలతో వైఎస్​ఆర్ ఆసరా లబ్ధి
author img

By

Published : Apr 17, 2021, 4:50 PM IST

తప్పుడు పత్రాలు సృష్టించి వైఎస్ఆర్ ఆసరా పథకం కింద రూ.30 వేలు లబ్ధిపొందిన వ్యక్తిపై గుంటూరు జిల్లా కొత్తపేట పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు నమోదైంది. అతడికి సహకరించిన వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ జయరామకృష్ణ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తపేట రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం... ప్రకాశం జిల్లాకు చెందిన జి. లక్ష్మణస్వామి (71) మార్చి 30వ తేదీన గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయించుకొని ఏప్రిల్ 1న డిశ్ఛార్చి అయినట్లు తప్పుడు పత్రాలు సృష్టించారు. వాటి ద్వారా తన ఖాతాకు నిధులు జమ చేయించుకున్నారు. ఈ విషయమై అక్కడి ఆరోగ్యమిత్ర రాజశేఖర్, జిల్లా కోఆర్డినేటర్ శ్రావణ్ కుమార్ ద్వారా.. గుంటూరు జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ జయరామకృష్ణకు సమాచారం వచ్చింది.

ఇదీ చదవండి: కరోనా మరణాలను ప్రభుత్వాలు దాస్తున్నాయా?

జీజీహెచ్​లో ఆరోగ్యశ్రీ పత్రాలు అప్​లోడ్ చేయడానికి 'హార్వే ఇన్ఫర్మాటిక్స్​' అనే ఓ ప్రైవేటు సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు ఫిర్యాదుదారుడు తెలిపారు. ఆ సంస్థ తరపున శ్రీనివాసరావు అనే వ్యక్తి గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో డేటా ఎంట్రీ ఉద్యోగిగా పొరుగుసేవల విభాగంలో పని చేస్తున్నట్లు వెల్లడించారు. లక్ష్మణస్వామి శస్త్రచికిత్స చేయించుకొని డిశ్చార్జి అయినట్లు.. శ్రీనివాసరావు సాయంతో తప్పుడు పత్రాలు సృష్టించారని జయరామకృష్ణ ఫిర్యాదులో పేర్కొన్నారు. వాటిని గుంటూరు ఆరోగ్య మిత్ర రమేష్​కు చెందిన కంప్యూటర్ ద్వారా అప్​లోడ్​ చేసినట్లు వివరించారు. ఆ పత్రాలపై సంబంధిత అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి పంపించారన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదీ చదవండి:

ఆసుపత్రి మెట్లపైనే తుదిశ్వాస విడిచిన కొవిడ్‌ బాధితురాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.