CASE FILE ON PAWAN KALYAN : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. I.P.C. సెక్షన్ 336, 279, మోటారు వాహనాల చట్టం సెక్షన్ 177 కింద కేసు నమోదు చేశారు. తెనాలిలోని మారిస్ పేటకు చెందిన శివకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తాడేపల్లి పోలీసులు తెలిపారు. ఈనెల 5న తాను తెనాలి నుంచి తాడేపల్లి వెళ్తుండగా జాతీయ రహదారిపై జనసేన నేతలు, కార్యకర్తలు ర్యాలీగా వెళ్తున్నారని.. ఆ గందరగోళంలో తాను వాహనం నుంచి కిందపడి గాయాల పాలయ్యానని శివకుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈనెల 10న శివకుమార్ నుంచి ఈ ఫిర్యాదు అందినట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన 5రోజుల తర్వాత ఫిర్యాదు రావటం... ఫిర్యాదు అందిన రెండు రోజుల తర్వాత కేసు పెట్టడం అనుమానాలకు తావిస్తోంది. తాడేపల్లి మండలం ఇప్పటంలో ఈనెల 4న రోడ్డు విస్తరణ పేరుతో ప్రజల ఇళ్లను అధికారులు ధ్వంసం చేశారు. తర్వాత పవన్ ఇప్పటం వెళ్లి బాధితుల్ని పరామర్శించారు. ఇప్పటం వెళ్లే సమయంలో పవన్ కారు పైకి ఎక్కి కూర్చున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. అసలు శివకుమార్ అనే వ్యక్తి నిజంగానే ఉన్నారా లేదా అని జనసేన నేతలు ఆరా తీస్తున్నారు.
ఇవీ చదవండి: