పాలనా రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ...రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. 101వ రోజు 'అమరావతి వెలుగు' పేరుతో శుక్రవారం రాత్రి రాజధాని గ్రామాల్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. లాక్డౌన్ నేపథ్యంలో ఇళ్ల వద్దే కొవ్వొత్తులతో ఆందోళన వ్యక్తం చేశారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. మహిళలు, చిన్నారులు అమరావతి వెలుగు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీచదవండి