గుంటూరు జీజీహెచ్‌కు బర్నింగ్ వార్డు మంజూరైనట్లు.. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్డర్ ప్రభావతి తెలిపారు. కాలిపోయిన రోగులకు సత్వర చికిత్స అందించేందుకు.. రూ.7 కోట్లతో ఈ బ్లాక్ ను నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతించినట్లు ప్రభావతి చెప్పారు. జీజీహెచ్ ప్రతిష్ట చాటేలా.. ఏడాదిలో ఎన్నో అరుదైన శస్త్రచికిత్సలు నిర్వహించామని.. కొత్త ఏడాదిలో కూడా అధునాతన సదుపాయాలు, పరికరాలు అందుబాటులోకి రానున్నాయని వివరించారు. పొదిలిప్రసాద్ బ్లాక్‌పై సూపర్ స్పెషాలిటీ సేవలకు మరో అంతస్థు నిర్మించినున్నట్లు చెప్పారు. మాతా, శిశు బ్లాక్ నిర్మాణ పనులు పునః ప్రారంభం కానున్నాయన్నారు. కొవిడ్ పూర్తిగా తగ్గాక.. గుండె మార్పిడి, మోకాళ్ల అపరేషన్లు నిర్వహిస్తామని తెలిపారు. జీజీహెచ్‌లో వైద్య సేవల పట్ల ప్రజలకు నమ్మకం పెరిగిందని.. వారి నమ్మకానికి తగ్గట్లుగా వైద్య సేవలు మరింత విస్తృతం చేస్తామని ప్రభావతి అన్నారు.
ఇదీ చదవండి: