ETV Bharat / state

ఆప్తులు చనిపోయిన వేళ... అంతులేని ఆవేదన

author img

By

Published : Sep 29, 2019, 5:25 AM IST

Updated : Sep 29, 2019, 9:35 AM IST

ఆప్తులు చనిపోయిన వేళ... ఆ ఆవేదన అంతులేనిది. గుంటూరు జిల్లా ఈపూరు మండలం ఎర్రబాలెం గ్రామస్తులది మరింత విషాదం. చనిపోయిన తర్వాత భౌతికకాయాన్ని తీసుకెళ్లేందుకు వారు పడే పాట్లు వర్ణనాతీతం. చావు కంటే శ్మశానానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించడమే నరకం అంటున్నారు ఆ గ్రామ ప్రజలు. పొలం గట్లపైనే మృతదేహాన్ని మోయడం చూస్తే... ఎవరికైనా ఆవేదన కలగకమానదు.

ఆప్తులు చనిపోయిన వేళ... అంతులేని ఆవేదన
ఆప్తులు చనిపోయిన వేళ... అంతులేని ఆవేదన

ఓవైపు మృతదేహం బరువు... మరోవైపు వర్షం కారణంగా బురదమయంగా మారిన పొలం గట్లు. శవంతో పాటే ఎక్కడ జారిపడతారేమో అనే భయం. శ్మశానానికి వెళ్లేందుకు వేరే దారి లేక... ఏళ్ల తరబడి ఆ గ్రామస్తులు నరకాన్ని చూస్తున్నారు. గుంటూరు జిల్లా ఈపూరు మండలం ఎర్రబాలెం గ్రామస్తులు ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తున్న నరకయాతన ఇది. పూర్వం గ్రామానికి చెందిన కొందరు దాతలు శ్మశానానికి భూమి విరాళంగా ఇచ్చారు. అప్పటినుంచి ఆ స్థలంలోనే దహన సంస్కారాలు నిర్వహించేవారు.

అప్పట్లో మెట్టుభూమి కావడం కారణంగా ఎవరూ దానిపై దృష్టి పెట్టలేదు. కాలక్రమేణా ఈ భూమి మాగాణిగా మారడంతో ఒక్కసారిగా విలువ పెరిగింది. శ్మశానానికి సంబంధించిన భూమిని కొందరు ఆక్రమించుకున్నారు. కొంత భూమిని తమ పొలంలో కలిపేసుకుని సాగు చేసుకుంటున్నారు. ఇక శ్మశానానికి కొద్దిపాటి స్థలమే మిగిలింది. శ్మశానానికి వెళ్లే దారులూ మూసుకుపోయాయి. ఆక్రమణలు తొలగించాలని అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు.

గతంలో ఈ శ్మశానానికి భూములు విరాళంగా ఇచ్చారు గాని... వాటిని రికార్డుల్లోకి నమోదు చేయకపోవడం కారణంగా ఈ సమస్య ఎదురైంది. ఇటీవల గ్రామానికి చెందిన కొలగాని భగవతమ్మ అనే వృద్ధురాలు మృతి చెందగా.... ఆమె దహన సంస్కారానికి బంధువులు పడ్డ పాట్లు వైరల్ అయ్యాయి. శ్మశానంలో అంత్యక్రియలకు చోటులేక... పొలం గట్లపైనే దహన సంస్కారాలు నిర్వహించారు. తాము అనుభవిస్తున్న కష్టాలపై అధికారులు స్పందించి... ఆక్రమణలకు గురైన భూమిని పరిరక్షించాలని ఎర్రబాలెం వాసులు వేడుకుంటున్నారు.

ఇదీ చదవండీ... నాడు వెలవెల... నేడు జలకళ

Intro:

Body:తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో కాండ్రకోట వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జగన్ సీఎం అయినందుకు పాదయాత్ర చేశారు. తమ గ్రామం నుంచి ప్రత్యేక పుణ్యక్షేత్రం అన్నవరం వరకు పాదయాత్ర చేస్తామని ఎన్నికల ముందు వారు అన్నారు. ఇందులో వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం చాలా రోజుల తరువాత కార్యరూపం దాల్చింది.

Conclusion:
Last Updated : Sep 29, 2019, 9:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.