గుంటూరులో ఆంధ్రప్రదేశ్ బి.సి.సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పూలే విగ్రహం వద్ద మండల్ డే కార్యక్రమం నిర్వహించారు. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీలను పట్టి పీడిస్తున్న పేదరికం, వెనకబాటుతనం నుంచి సమాజంలో వారిని భాగస్వాములను చేసే ప్రయత్నంలో బి.పి. మండల్ (బిందేశ్వరి ప్రసాద్ మండల్) చేసిన కృషి మరవలేనిదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు అన్నారు.
మండల్ కమిషన్‌లోని 40 సిఫారసులను పూర్తిగా అమలులోకి తెచ్చి బీసీల సమగ్రాభివృద్ధికి పాటు పడినప్పుడే ఆ మహనీయుడికి నిజమైన నివాళి అర్పించినట్లవుతుందన్నారు. ఈనెల 8న బీసీలను అందరినీ ఏకం చేసి విజయవాడలో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహిస్తునట్లు చెప్పారు. బీసీలను అన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంక్‌గానే వాడుకుంటున్నాయని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు కుమ్మర క్రాంతి కుమార్ అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తే రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామన్నారు.
ఇదీ చదవండి: 4 Arrest in murder case: హత్య కేసు.. నలుగురు అరెస్టు