దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనల్లో భాజపా కార్యకర్తల ప్రమేయం ఉందన్న డీజీపీ గౌతమ్ సవాంగ్.... ఆ ప్రకటనపై స్పష్టతనివ్వాలని.. లేకుంటే పరువు నష్టం దావా వేస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హెచ్చరించారు. ఈ మేరకు ఆయన డీజీపీ సవాంగ్‌కు లేఖ రాశారు. హిందూ దేవాలయాలపై జరిగిన దాడుల్లో మా పార్టీ కార్యకర్తల ప్రమేయం ఉన్నట్లు మీరు ప్రకటించిన కారణంగా మాపై తప్పుడు ముద్ర పడుతోందని అన్నారు. రాజ్యాంగబద్ధమైన, బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మీరు ప్రజల్లో గందరగోళం, తప్పుడు భావన కల్పించే ప్రకటనలు జారీ చేయడం సరికాదన్నారు. దాడుల్లో ఏ ఒక్క భాజపాక కార్యకర్త పాల్గొనలేదన్న ఆయన... ఉద్దేశపూర్వంగా మా పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా ప్రకటన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాల దాడులపై స్పష్టతనివ్వకపోతే..... క్రిమినల్ చట్టం ప్రకారం మీపై పార్టీ చర్యలు తీసుకుటోందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా డీజీపీ వ్యవహరిస్తున్నారని భాజపా రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు ఆరోపించారు.
ఇవీ చదవండి