గుంటూరు జిల్లా వినుకొండ రైల్వే స్టేషన్‌ను ఎంపీ జీవీఎల్ పరిశీలించారు. స్టేషన్లోని రైల్వే ఉద్యోగులు, ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైల్వే శాఖతో రాష్ట్ర ప్రభుత్వ చేసుకున్న ఒప్పందం ప్రకారం నిధులు మంజూరులో జాప్యం చేయడం వల్ల 10 రైల్వే ప్రాజెక్టులు ప్రశ్నార్థకంగా మారాయని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. రైల్వే స్టేషన్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖతో ఉన్న ఒప్పందం మేరకు మ్యాచింగ్ ఫండ్స్ ఇవ్వకపోవడం వలన అనేక రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల మౌలిక వసతులు దూరం అవుతున్నాయని అన్నారు.
నరసరావుపేట, రెంటచింతల, పిడుగురాళ్ల, నడికుడి, మాచర్ల, వినుకొండ రైల్వే స్టేషన్ ను సందర్శించానని.. ప్రయాణికులకు మౌలిక వసతులు లేక పడుతున్న ఇబ్బందులను గమనించినట్లు తెలిపారు. ఎంపీ నిధుల నుంచి రూ. 50 లక్షలను వసతుల కల్పనకు కేటాయించినట్లు చెప్పారు. రైల్వే శాఖతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం మేరకు అభివృద్ధి పనులు చేసే విధంగా ఒత్తిడి తెస్తామన్నారు. రైల్వే స్టేషన్లలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి రేపు డీఆర్ఎం సమావేశం నిర్వహించనున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి:
Drugs Mafia: 'గుజరాత్‌లో డ్రగ్స్ దొరికాయని.. ప్రధాని మోదీకి లింకు పెడతారా?'