బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లఖ్‌నవూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు... కమ్యూనిస్టులకు రుచించదని అన్నారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. తీర్పుపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ఆడ్వాణీ, జోషి, ఇతర నాయకులు... బాబ్రీ మసీదు నిర్మాణాన్ని కూల్చివేయాలని ఆదేశించడం నారాయణ చూశారా? అని ప్రశ్నించారు.
ఆ నిర్మాణం కూలిపోయే సందర్భంలో తాను కూడా అక్కడికి కూత వేటు దూరంలో ఉన్నానని సోము వీర్రాజు తెలిపారు. కరసేవ మాత్రమే చేయాలని తమ పార్టీ నాయకులు కోరారు తప్ప... ఇతర అంశాలపై మాట్లాడనందునే సీబీఐ కోర్టు ఈ కేసు కొట్టివేసిందన్నారు.
ఇదీ చదవండి: