గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరులో బైక్ దొంగల గుట్టు... వారు చోరీ చేసిన వాహనం ద్వారానే బయటపడింది. ఓ వాహనాన్ని కొట్టేసేందుకు వచ్చిన ఇద్దరు దొంగలను స్థానికులు గమనించారు. కేకలు వేశారు. కంగారు పడిన దొంగలు.. తాము తీసుకువచ్చిన వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు. అలా వదిలిన వాహనం ఆధారంగానే పోలీసులు.. వారిని పట్టుకున్నారు. గతంలో మాయమైన మరో 3 ద్విచక్ర వాహనాలను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు.
జిల్లాలోని తాడికొండ చెందిన రియాజ్ బాషా, ముస్తఫాను నిందితులుగా గుర్తించారు. చెడు వ్యసనాలకు, దురలవాట్లకు బానిసలుగా మారిన ఈ స్నేహితులు.. లాక్ డౌన్ కారణంగా జనం అంతా ఇళ్లలోనే ఉండటాన్ని ఆసరాగా చేసుకున్నారు. కొన్ని నెలల నుంచి రియాజ్ బాషా ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్నాడని తెనాలి గ్రామీణ సీఐ అశోక్ కుమార్ తెలిపారు. నిందితుడు రియాజ్ బాషా పైన ఇప్పటికే దొంగతనాలు కేసులు, ఒక హత్య కేసు ఉందన్నారు. నిందితుల్ని న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు సీఐ వివరించారు.
ఇదీ చదవండి: