గుంటూరులో తెల్లవారుజామునే భోగి మంటలు వేస్తూ.. యువకులు, పిల్లలు, మహిళలు సందడి చేశారు. కరోనా చీకట్లు తొలగిపోవాలంటూ వేడుకున్నారు. భోగి మంటల వద్ద చిన్నారులతో సహా పెద్దలు ఉత్సాహంగా గడిపారు.
చిలకలూరిపేటలో..
చిలకలూరిపేటలో భోగి మంటలు వెలిగించారు. పిల్లలకు భోగి విశిష్టతను తెలుపుతూ.. పెద్దలు దగ్గరుండి తెల్లవారుజామునే వేడుక చేశారు. చెడు ఆలోచనలను భోగి మంటల్లో కలిపివేయాలనీ.. అప్పుడే ఆనందంగా ఉండగలమని వివరించారు.
పిడుగురాళ్లలో..
పిడుగురాళ్లలో సంక్రాంతి పండగ సందడి నెలకొంది. మూడు రోజుల సంక్రాంతి వేడుకల్లో ముందుగా భోగి పండగను నగర ప్రజలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున లేచి భోగి మంటలు వేసుకొని మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.
మాయాబజార్లోని శివాలయం సెంటర్లో ముగ్గుల పోటీలు రంగుల హరివిల్లులు మధ్య ముగ్గుల పోటీలు జరిగాయి ఈ ముగ్గుల పోటీల్లో వివిధ రకాలుగా అలంకరణతో వేశారు. అనంతరం శివాలయం కమిటీ వారికి మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు.
ఇదీ చదవండి: