ETV Bharat / state

కుల గణన కోసం.. ఏకమైన బీసీ సంఘాల నాయకులు - BC groups

BC community leaders: గత కొద్ది కాలంగా బీసీల హక్కుల కోసం పోరాడుతున్న నేతలంతా ఏకమయ్యారు. తమకు జరుగుతున్న అన్యాయంపై గళం విప్పారు. తమను ఓటుబ్యాంకుగానే వాడుకుంటున్నారని ఆరోపించారు. 60 శాతం ఉన్న బీసీలకు 27శాతం మాత్రమే రిజర్వేషన్లు అమలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బీసీల గణన జరిపించాలని డిమాండ్ చేశారు.

బీసీలకు 27శాతం రిజర్వేషన్లు
BC community leaders
author img

By

Published : Oct 27, 2022, 8:56 PM IST

BC groups want caste wise enumeration: బీసీల పట్ల పాలకులు వివక్ష చూపుతున్నారని.. కేవలం ఓటుబ్యాంకుగానే చూస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా.. బీసీల కుల గణన జరగలేదని చెప్పారు. జనాభాలో 60 శాతం బీసీలు ఉండగా... కేవలం 27 శాతం మాత్రమే రిజర్వేషన్లు అమలవుతున్నాయని చెప్పారు. గుంటూరులో మీడియా సమావేశంలో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. సామాజిక న్యాయమంటే ఇద్దరు, ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వడం కాదని పేర్కొన్నారు. జనాభా దామాషా నిష్పత్తి ప్రకారం బీసీలకు అందాల్సిన వాటాను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా బీసీల గణన జరగాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు డిమాండ్ చేశారు.

బీసీ సంక్షేమ సంఘం నాయకులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.