ETV Bharat / state

టిడ్కో ఇళ్లకు రుణాలు ఇచ్చేందుకు ససేమిరా అంటున్న బ్యాంకులు - టిడ్కో ఇళ్లకు రుణాలు

TIDCO House Loans: పురపాలక సంఘాల్లో టిడ్కో ఇళ్లకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ససేమిరా అంటున్నాయి. ఈతరుణంలో లబ్ధిదారుల నుంచే వసూలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాలుగు విడతల్లో నగదు తీసుకునేలా ఆదేశాలిచ్చింది. ఇది ఆర్థికంగా భారమవుతుందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tidco home loans
Tidco home loans
author img

By

Published : Mar 7, 2022, 5:25 AM IST

TIDCO House Loans: పురపాలక సంఘాల్లో టిడ్కో (పట్టణ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ) ఇళ్లకు బ్యాంకులు ఇవ్వాల్సిన రుణాన్ని స్వచ్ఛందం పేరిట లబ్ధిదారుల నుంచే వసూలు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో టిడ్కో గృహాలను నిర్మిస్తోంది. వీటిలో 300 చ.అ. విస్తీర్ణమున్న ఇళ్లను పేదలకు ఉచితంగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 365 చ.అ. ఇంటికి రూ.3.15 లక్షలు, 430 చ.అ. ఇంటికి రూ.3.65 లక్షల రుణాన్ని లబ్ధిదారు పేరిట బ్యాంకులు మంజూరు చేయాల్సి ఉండగా అవి ఆసక్తి చూపడం లేదు. దీంతో నిర్దేశిత మొత్తాన్ని చెల్లించేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చే లబ్ధిదారులు రెండు/మూడు/నాలుగు విడతల్లో కట్టేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వీటిని క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అధికారులు ఇస్తున్నారు.

పేదలకు భారమే..

గూడు లేని నిరుపేదలు తమకు అధునాతన వసతులతో టిడ్కో ఇళ్లు సమకూరుతాయని నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు కొందరైనా ముందుకొస్తారనే ఆలోచనతో ‘స్వచ్ఛందం’ పేరిట ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం మిగతా వారిపై ఒత్తిడి తెచ్చే ప్రమాదం ఉంది. ఇన్నాళ్లూ ఎదురుచూసిన ఇల్లు తమకు దక్కకుండా పోతుందేమోనన్న ఆందోళనతో కొందరు అధిక వడ్డీలకు తెచ్చి అప్పులపాలయ్యే ప్రమాదమూ ఉంది.

అమలు స్వచ్ఛందమేనని ప్రభుత్వం చెబుతున్నా తక్షణమే రుణ వాటాలో కొంత శాతాన్ని చెల్లించడం తలకు మించిన భారమేనని లబ్ధిదారులు అంటున్నారు. ఉదాహరణకు 430 చ.అ. గృహ లబ్ధిదారు ఇప్పటికిప్పుడు రుణ వాటా రూ.3.65 లక్షల్లో 25% అంటే రూ.81,500 కట్టాలి. మిగతా మొత్తాన్ని ఇంటిని అప్పగించే సమయానికి చెల్లించాలి. ఇంత మొత్తాన్ని కట్టే పరిస్థితే ఉంటే ఇన్నాళ్లూ సొంతింటి కోసం ఎందుకు ఎదురుచూస్తామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బ్యాంకులు ఇచ్చింది రూ.650 కోట్లే..

రాష్ట్రవ్యాప్తంగా గత ప్రభుత్వం చేపట్టిన 3.10 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణాల్లో 2.62 లక్షల ఇళ్లను మాత్రమే వైకాపా ప్రభుత్వం చేపట్టింది. వీటిలో చిన్నపాటి మౌలిక సదుపాయాలు మినహా 90 శాతానికిపైగా పూర్తయినవి దాదాపుగా లక్ష ఇళ్లు ఉన్నాయి. 2.62 లక్షల ఇళ్లకు చెందిన లబ్ధిదారులకు బ్యాంకులు ఇచ్చే రుణం రూ.4 వేల కోట్ల వరకు టిడ్కోకు రావాలి. కానీ... లబ్ధిదారులకు 50 ఏళ్ల వయసు దాటింది, సిబిల్‌ స్కోర్‌ సరిగా లేదు తదితర కారణాలు చూపుతూ ఇప్పటివరకు సుమారు రూ.650 కోట్లు మాత్రమే మంజూరు చేశాయి.

ఇళ్లు అప్పగించకుండానే రుణ వాయిదా కట్టాలని నోటీసులు..

గత ప్రభుత్వ హయాంలో, ఇప్పుడు కొందరు లబ్ధిదారుల పేరుతో బ్యాంకులు టిడ్కోకు రుణాలు మంజూరు చేశాయి. ఈ రుణాల సేకరణకు అధికారులు 30 బ్యాంకుల్ని సంప్రదిస్తున్నారు. ఇల్లు అందిన తర్వాత బ్యాంకులిచ్చే రుణాన్ని 20 ఏళ్లపాటు నెల వాయిదాల్లో లబ్ధిదారులు చెల్లించాలి. ఇప్పటివరకు లబ్ధిదారులకు గృహాలు ఇవ్వలేదు. కానీ ఓ జాతీయ బ్యాంకు రుణ వాయిదా చెల్లించాలని లబ్ధిదారులకు నోటీసులు జారీ చేసింది. ఆ బ్యాంకు పరిధిలో ఉన్న దాదాపు 10 వేల మంది లబ్ధిదారులకూ మొదటి విడత నోటీసులు అందినట్లు తెలిసింది. లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేసే వరకు మరోమారు ఎలాంటి నోటీసులు జారీ చేయరాదని సదరు బ్యాంకులకు సూచించినట్లు అధికారులు చెబుతున్నారు. కొన్ని బ్యాంకులు 60 ఏళ్లు దాటిన లబ్ధిదారుల ఖాతాల్లో ఉన్న మొత్తాన్ని రుణ వాయిదా కింద జమ చేసుకుంటున్నాయి. దీంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: Venkaiah Naidu: 'రాజకీయాల్లో కులం, డబ్బు, నేరచరిత్ర కీలకంగా మారాయి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.