గుంటూరులోని నగరంపాలెం ఎస్‌బీఐ, ఐటీసీ రోడ్డు వద్ద బ్యాంకు ఉద్యోగులు నిరసన చేపట్టారు. ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అఖిల భారత బ్యాంకు ఉద్యోగ సంఘాల సమాఖ్య సమ్మెకు పిలుపునివ్వగా ఉద్యోగులు ఇందులో పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేటుపరమైతే.. ఉద్యోగులతో పాటు సాధారణ ప్రజలు సైతం ఇబ్బందులు పడటం ఖాయమని ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
బ్యాంకు వడ్డీ రేట్లు పెరుగుతాయని.. పేద, మధ్య తరగతి ప్రజలకు సులభంగా రుణాలు లభ్యం కావని.. నిరుద్యోగులకు భవిష్యత్తులో ఉద్యోగాలు లభించవని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకున్న కోట్లాది రూపాయలను బడాబాబులు ఎగవేస్తున్నందువల్లే దెబ్బతింటున్నారు. వాటిని కేంద్ర ప్రభుత్వం పరిరక్షించాలని వారు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: