వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినందుకు అరెస్టయిన తెలుగుదేశం కార్యకర్తలు.. వెంకట్ మహేష్, కళ్యాణ్ విడుదలయ్యారు. యూట్యూబ్ ఛానల్లో వచ్చిన పోస్టులపై వైకాపా నేత పానుగంటి చైతన్య గుంటూరు అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మహేష్, కళ్యాణ్‌ను మంగళవారం.. పోలీసులు అరెస్టు చేశారు. తెలుగుదేశం నేత చిట్టిబాబు వారిద్దరికీ వ్యక్తిగత పూచీకత్తు ఇవ్వడంతో... ఇవాళ వారిద్దరిని బెయిల్ పై విడుదల చేశారు.
ఇదీ చదవండి: విజయసాయిని విమర్శిస్తూ పోస్టు.. వ్యక్తి అరెస్టు