గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం ఇస్సపాలెం గ్రామంలో గోమాతకు సీమంతం వేడుక నిర్వహించారు. గ్రామానికి చెందిన బెల్లంకొండ బాజి, నాగలక్ష్మి, బెల్లంకొండ ఈశ్వరరావు, అరుణ అనే రెండు కుటుంబాల దంపతులు ఈ కార్యక్రమం జరిపించారు. రెండు రోజుల ముందుగా గ్రామస్థులకు ఆహ్వాన పత్రికలను అందించారు. దంపతుల స్వగృహం వద్ద మండపం ఏర్పాటు చేసి వేడుక నిర్వహించారు.
తమ ఇష్ట దైవంగా కొలుచుకుంటూ రెండేళ్ల నుంచి పెంచుకుంటున్న గోవుకు వేడుక జరిపించటం ఆనందంగా ఉందని వేడుక నిర్వహించిన దంపతులు అన్నారు. గోమాత ప్రాముఖ్యతను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశ్యంతోనే సీమంతం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి గ్రామంలోని నూట ఎనిమిది మంది ముతైదువులు హాజరయ్యారు. మహిళలు గోవుకు చీరసార, పసుపుకుంకుమ సమర్పించారు. వేడుకకు వచ్చిన వారికి భోజన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు దంపతులు తెలిపారు.
ఇదీ చదవండి:
గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని కేంద్రాన్ని కోరతాం: తితిదే