తెదేపా ప్రచారసభలకు ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఎలక్షన్ మిషన్ 2019పై తెదేపా నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ చేశారు. పింఛన్ పొందే వృద్ధుల్లో తెదేపా అంటే ఎంతో ఆదరణ ఉందన్నారు. ఊతకర్రకు పసుపు కండువాతో వృద్ధులంతా తెదేపా జెండా ఎత్తారని గుర్తు చేశారు. 'పసుపు - కుంకుమ’ పథకంతో మహిళలంతా తెదేపా సభలకు వస్తున్నారన్నారు. నుదిటిపై పసుపు బ్యాండ్‌లతో యువతరం కదం తొక్కుతోందని తెలిపారు. ఈ స్ఫూర్తి అందరిలో రావాలని... రాష్ట్రాన్ని కాపాడుకోవాలని నేతలకు సూచించారు. రేపు తెదేపా ఆవిర్భావ దినోత్సవం విజయవంతం చేయాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. అన్నిచోట్లా 38వ ఆవిర్భావ దినోత్సవం విజయవంతంగా.. వినూత్నంగా జరపాలన్నారు. పసుపు జెండా రాష్ట్ర గౌరవాన్ని కాపాడిందన్న విషయాన్నిప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. తెదేపా చేస్తున్న ధర్మపోరాటానికి ప్రజల మద్దతు కోరాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని... వ్యవస్థలను రక్షించాలని పార్టీ నేతలకు సీఎం సూచించారు.
తెదేపా ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయండి! - abt tdp
తెదేపా ప్రచారసభలకు ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఎలక్షన్ మిషన్ 2019పై పార్టీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ చేశారు. శుక్రవారం తెదేపా ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
తెదేపా ప్రచారసభలకు ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఎలక్షన్ మిషన్ 2019పై తెదేపా నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ చేశారు. పింఛన్ పొందే వృద్ధుల్లో తెదేపా అంటే ఎంతో ఆదరణ ఉందన్నారు. ఊతకర్రకు పసుపు కండువాతో వృద్ధులంతా తెదేపా జెండా ఎత్తారని గుర్తు చేశారు. 'పసుపు - కుంకుమ’ పథకంతో మహిళలంతా తెదేపా సభలకు వస్తున్నారన్నారు. నుదిటిపై పసుపు బ్యాండ్‌లతో యువతరం కదం తొక్కుతోందని తెలిపారు. ఈ స్ఫూర్తి అందరిలో రావాలని... రాష్ట్రాన్ని కాపాడుకోవాలని నేతలకు సూచించారు. రేపు తెదేపా ఆవిర్భావ దినోత్సవం విజయవంతం చేయాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. అన్నిచోట్లా 38వ ఆవిర్భావ దినోత్సవం విజయవంతంగా.. వినూత్నంగా జరపాలన్నారు. పసుపు జెండా రాష్ట్ర గౌరవాన్ని కాపాడిందన్న విషయాన్నిప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. తెదేపా చేస్తున్న ధర్మపోరాటానికి ప్రజల మద్దతు కోరాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని... వ్యవస్థలను రక్షించాలని పార్టీ నేతలకు సీఎం సూచించారు.
Body:sd
Conclusion:ss